హిందువుల ప్రముఖ పండగల్లో ఒకటి దీపావళి. ఈ పండగ వస్తుందంటే చాలు దేశ విదేశాల్లో ఉన్న భారతీయులు దీపావళి పర్వదినాన్ని జరుపుకోవడానికి రెడీ అవుతారు. అయితే తాజాగా దీపావళి పండగకి న్యూయార్క్ లో ప్రాముఖ్యత దక్కింది. దీపావళి పండగను ప్రభుత్వ పాఠశాల సెలవు దినంగా ప్రకటించారు నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్. ఈ నిర్ణయం 2023 నుంచి నగరంలో అమల్లోకి రానున్నదని పేర్కొన్నారు. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ఈ నిర్ణయం నెక్స్ట్ ఇయర్ నుంచి కార్యరూపం దాల్చనున్నదని.. నగరం ప్రాముఖ్యత గురించి .. న్యూయార్క్ పట్టణ ఏకత్వంపై సందేశం ఇచ్చినట్టు అయిందన్నారు. అంతేకాదు పిల్లలకు దీపావళి పండగ గురించి తెలుసుకునే విధంగా ప్రోత్సహిస్తుందని చెప్పారు. స్కూల్ కేలండర్ లోని యానివర్సరీ డేను దీపావళి కోసం కేటాయించారు. యానివర్సరీ డేను ఏటా జూన్ మొదటి గురువారం అక్కడ నిర్వహిస్తుంటారు. ఇదే విషయం పై న్యూయార్క్ అసెంబ్లీ సభ్యురాలు జెనిఫర్ రాజ్‌కుమార్ స్పందిస్తూ.. దీపావళి గురించి , దీపాల పండుగ అంటే ఏమిటో “చాలా నేర్చుకున్నాను” అని అన్నారు.
న్యూయార్క్‌లోని భారత కాన్సుల్ జనరల్ రణధీర్ జైస్వాల్ దీపావళిని పాఠశాలలకు సెలవుగా ప్రకటించినందుకు ఆడమ్స్‌కు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు ఈ డిమాండ్ ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉందని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు దీపావళిని పబ్లిక్ హాలిడేగా ప్రకటించడం న్యూయార్క్ పట్టణ వైవిధ్యం, బహుళత్వానికి బలమైన సందేశం ఇచ్చిందని చెప్పారు. దీపావళిని అన్ని వర్గాల ప్రజలు సంబరాలు చేసుకోవడానికి, భారతీయ తత్వం, వారసత్వాన్ని అనుభవించడానికి అవకాశం కల్పిస్తుంది’’ అని రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు.
#Diwali symbolizes the victory of light over darkness, and today that light is brighter.@NYCMayor stood in solidarity as @JeniferRajkumar introduced legislation to replace “Anniversary Day” on the school calendar with Diwali. pic.twitter.com/yrryS5DGSk
— City of New York (@nycgov) October 20, 2022
ఈ నిర్ణయంతో తాము గర్వపడుతున్నామని.. న్యూ యార్క్ లో దీపావళిని జరుపుకునే హిందూ, బౌద్ధ, సిక్కు, జైన మతాలకు చెందిన 2,00,000 మంది న్యూయార్క్ వాసులకు గుర్తింపు దక్కే సమయం ఆసన్నమైందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకుని వచ్చిన చట్టం అమలులోకి వచ్చిన తర్వాత, వచ్చే ఏడాది నుంచి న్యూయార్క్ నగరంలో దీపావళికి పాఠశాల సెలవు ఉంటుంది.
న్యూయార్క్ రాష్ట్ర విద్యా చట్టాల ప్రకారం.. కనీసం 180 రోజుల పాఠశాల బోధన ఉండాలి. ఈ నేపథ్యంలో ఇక నుంచి పాఠశాల క్యాలెండర్‌లో సెలవులపై ఎటువంటి మార్పులు ఉండవని స్పష్టం చేశారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..