Trailblazer Women Award: టీవీ9 ప్రతినిధి సుగుణ రెడ్డికి అరుదైన గౌరవం.. ట్రైల్‌బ్లేజర్ ఉమెన్ అవార్డు ప్రదానం..
అమెరికాలోని కాలిఫోర్నియాలో టీవీ9 ప్రతినిధిగా సేవలందిస్తున్న సుగుణ రెడ్డికి అరుదైన గౌరవం లభించింది. కాలిఫోర్నియా రాష్ట్రంలో టీవీ మీడియా రంగంలో సుగుణ రెడ్డి అందిస్తున్న సేవలను గుర్తిస్తూ "ట్రైల్‌బ్లేజర్ ఉమెన్" అవార్డుకు సుగుణరెడ్డిని ఇండో అమెరికన్ల సంఘం ఎంపిక చేసింది. ఆమెకు ఈ అవార్డు లభించడం పట్ల పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

అమెరికాలోని కాలిఫోర్నియాలో టీవీ9 ప్రతినిధిగా సేవలందిస్తున్న సుగుణ రెడ్డికి అరుదైన గౌరవం లభించింది. కాలిఫోర్నియా రాష్ట్రంలో టీవీ మీడియా రంగంలో అందిస్తున్న సేవలను గుర్తిస్తూ “ట్రైల్‌బ్లేజర్ ఉమెన్” అవార్డుకు సుగుణరెడ్డిని ఇండో అమెరికన్ల సంఘం ఎంపిక చేసింది. కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన అంతర్జాతీయ మహిళ దినోత్సవం వేడుకలో ఈ అవార్డును అందజేశారు. నిర్వాహకులు సుగుణ రెడ్డికి ఘన సన్మానం చేయడంతోపాటు.. “ట్రైల్‌బ్లేజర్ ఉమెన్” అవార్డును ప్రదానం చేశారు..
సుగుణా రెడ్డి ట్రైల్‌బ్లేజర్ ఉమెన్ అవార్డు అందుకోవడం పట్ల పలువురు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. మీడియా రంగంలో ఆమె ఈ అవార్డు అందుకోవడం గొప్ప పరిణామమని తెలిపారు. కాగా.. ఈ అవార్డు అందించడం పట్ల ఇండో అమెరికన్ల సంఘానికి సుగుణ రెడ్డి ధన్యావాదాలు తెలిపారు.
వీడియో చూడండి..
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సుగుణ రెడ్డితోపాటు కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా పలు రంగాల్లో విశేష సేవలందించిన పలువురికి అవార్డులను ప్రదానం చేశారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..