Global Hunger Crisis: అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు పెద్దలు.. ఆకలి అన్నవారికి కడుపునింపడం దైవ కార్యంతో సమానమని చెప్పారు. అంతేకాదు.. మనం తినే ఆహారాన్ని చిన్న చిన్న రీజన్స్ తో వృధా చేయవద్దని.. తినడానికి లేని వారిని ఒక్కసారి గుర్తు చేసుకోవాలని ఇంట్లో పెద్దలు చెబుతూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే.. ఉన్నవారికి తినడానికి అనేక రకాల ఆహారపదార్ధాలున్నా రకరకాల రీజన్స్ తో తినడానికి ఉండదు. అదే సమయంలో పేదవారికి తినాలని ఉన్నా ఆర్ధిక పరిస్థితులు అనుకూలించక.. అర్ధాకలితో అలమటిస్తారు. లేదా పస్తులు ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రపంచలో ఆకలి సంక్షోభానికి ముగింపు పలకాలని డిమాండ్ పలు NGO సంస్థలు డిమాండ్ చేస్తున్నారు.
ప్రపంచంలో ప్రతి 4 సెకన్లకు ఒకరు ఆకలితో మరణిస్తున్నారని 200 కంటే ఎక్కువ NGO లు హెచ్చరించాయి. ఇటువంటి పరిస్థితిలో, గ్లోబల్ హంగర్ క్రైసిస్‌ను అంతం చేయడానికి నిర్ణయాత్మక అంతర్జాతీయ చర్య తీసుకోవాలని కోరుతున్నాయి. “75 దేశాలకు చెందిన సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా ఆకలి దారుణమైన స్టేజ్ కు చేరుకుందని.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాదు.. ఆకలిని అంతం చేయడానికి అనేక చర్యలను సిఫార్సు చేస్తూ బహిరంగ లేఖలను NGO సంస్థలు విడుదల చేశాయి.
ఎన్జీవోలు ఒక ప్రకటనలో.. “2019 నుండి ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా 345 కోట్ల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని చెప్పారు. 21వ శతాబ్దంలో మళ్లీ కరువు రాదని ప్రపంచ నేతలు వాగ్దానం చేసినప్పటికీ.. సోమాలియా మరోసారి కరువును ఎదుర్కొంటోంది. ప్రపంచవ్యాప్తంగా 45 దేశాలలో 50 మిలియన్ల మంది ప్రజలు ఆకలి అంచున ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశాయి.
రోజుకు 19,700 మంది మరణం:
ప్రతిరోజు దాదాపు 19,700 మంది ఆకలితో చనిపోతున్నారని ఎన్జీవోలు తెలిపాయి. అంటే ప్రతి 4 సెకన్లకు ఒకరు ఆకలితో చనిపోతున్నారని..యెమెన్ ఫ్యామిలీ కేర్ అసోసియేషన్‌కు చెందిన మోహనా అహ్మద్ అలీ ఎల్జబాలి చెప్పారు. ఈ సంస్థ బహిరంగ లేఖపై సంతకం చేసింది. “21 వ శతాబ్దంలో కూడా వ్యవసాయం , పంటలను పండించే విధానంలో ఉపయోగించే పద్ధతులను చూస్తుంటే సిగ్గుచేటన్నారు. తాను నేటికీ కరువు గురించి మాట్లాడుతున్నానని తెలిపారు.
ఇది ఒక దేశం లేదా ఒక ఖండానికి సంబంధించిన సమస్య కాదని ఆయన అన్నారు. మొత్తం మానవాళికి జరుగుతున్న అన్యాయం గురించని తెలిపారు. ప్రజలు తమ భవిష్యత్తు గురించి ఆలోచించి తమను తాము, వారి కుటుంబాలను ఆదుకునేలా ప్రాణాలను కాపాడే విధంగా ఆహారం అందించాలని.. దీర్ఘకాలిక సహాయాన్ని అందించడంపై దృష్టి సారించాలని ఇందుకు మనం ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయవద్దన్నారు.
ప్రపంచంలో రాత్రి భోజనం చేయని వారు దాదాపు 69 కోట్ల మంది ఉన్నారని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ ఆకలి సమస్య మధ్యతరగతి, తక్కువ ఆదాయ దేశాల్లోనే ఎక్కువగా ఉందని పేర్కొంది. ఇక ఈ సమస్య కోవిడ్ -19 మహమ్మారి కారణంగా మరింత పెరిగింది.. ఎందుకంటే కోవిడ్ కారణంగా అనేక దేశాల ప్రజలు జీవనోపాధిని కోల్పోయారు. ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం కారణంగా, ఈ పరిస్థితులు మరింత దిగజారుతున్నాయని హెచ్చరిస్తున్నాయి ఎన్జీవో సంస్థలు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..