Corona Effect: కరోనా సంక్షోభం వేళ బంపర్ ఆఫర్.. వ్యాక్సీన్ వేయించుకోండి.. రూ. 7.34 కోట్లు గెలుచుకోండి..

|

May 14, 2021 | 3:08 PM

Corona Effect: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. చిన్నా.. పెద్దా.. ముసలి.. ముతక.. అనే తేడా లేకుండా అందరికీ వ్యాపిస్తుంది.

Corona Effect: కరోనా సంక్షోభం వేళ బంపర్ ఆఫర్.. వ్యాక్సీన్ వేయించుకోండి.. రూ. 7.34 కోట్లు గెలుచుకోండి..
Follow us on

Corona Effect: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. చిన్నా.. పెద్దా.. ముసలి.. ముతక.. అనే తేడా లేకుండా అందరికీ వ్యాపిస్తుంది. కరోనా కారణంగా ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ కోల్పుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా రక్కసిని అడ్డుకునేందుకు ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు వ్యాక్సీన్‌ను తయారు చేశారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతోంది. భారత్‌లోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. తొలుత ఎవరూ పెద్దగా ఆసక్తి కనబరచకపోగా.. ఇప్పుడు కరోనా ఉధృతి అధికంగా ఉండటంతో అందరూ వ్యాక్సీన్ తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే, వ్యాక్సీన్ మాత్రం లభించడం లేదు. వ్యాక్సీన్ కోసం ట్రై చేస్తే ‘నాట్ అవైలబుల్’ అని చూపిస్తోంది.

మనదేశంలో పరిస్థితి ఇలా ఉంటే.. మరికొన్ని దేశాల్లో పరిస్థితి అందుకు విభిన్నంగా ఉంది. వ్యాక్సీన్ తీసుకోండి మహాప్రబో అని మొత్తుకున్నా జనాలు ముందుకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. వ్యాక్సీన్ తీసుకునే ప్రజలను ప్రోత్సహించేందుకు పలు దేశాలు చిన్నపాటి బహుమతులు ప్రకటించగా.. ఒహియో మాత్రం మరొక్కడుగు ముందుకేసి భారీ స్థాయిలో నగదు బహుమతి ప్రకటించింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రోత్సహించేందుకు ఒక మిలియన్ డాలర్ల లాటరీని ప్రకటించింది. ఇది భారతదేశ కరెన్సీలో చూసుకున్నట్లయితే సుమారు రూ. 7.34 కోట్లు అన్నమాట. వ్యాక్సీన్ వేసుకోండి.. లాటరీ గెలుచుకోండి అంటూ ఒహియో గవర్నర్ మైక్ డివైన్ పిలుపునిచ్చారు. కాగా, ప్రస్తుతం ఒహియోలో లాక్‌డౌన్ అమల్లో ఉంది. కరోనా తగ్గుముఖం పట్టగానే లాక్‌డౌన్ నిబంధనలను సడిలిస్తామని అక్కడి అధికారులు ప్రకటించారు.

Also read:

Cyclone Names: అసలు తుఫానులకు పేర్లు ఎవరు పెడతారు…? ఎలా నిర్ణయిస్తారో మీకు తెలుసా..?

Sonu Sood: పెను ప్రమాదం నుంచి కోవిడ్ రోగులను రక్షించిన సోనూసూద్ బృందం.. ప్రశంసలు కురిపించిన ఆసుపత్రి యాజమాన్యం..

Viral Video : పోలీస్ దెబ్బలను తప్పించుకోవడానికి ఈ వ్యక్తి ఏం చేశాడో తెలిస్తే నవ్వొస్తుంది..!