Fuel Tanker Blast: సియర్రాలియోన్‌లో పెను విషాదం.. భారీ పేలుడు ఘటనలో 91 మంది మృతి..

|

Nov 06, 2021 | 7:06 PM

ఆఫ్రికా దేశం సియర్రాలియోన్‌లో భారీ పేలుడు జరిగింది. రాజధాని ఫ్రీ టౌన్‌లో ఆయిల్‌ ట్యాంకర్‌- ట్రక్కు ఢీకోవడంతో 91 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి.

Fuel Tanker Blast: సియర్రాలియోన్‌లో పెను విషాదం.. భారీ పేలుడు ఘటనలో 91 మంది మృతి..
Fuel Tanker Blast
Follow us on

Fuel tanker Blast in Sierra: ఆఫ్రికా దేశం సియర్రాలియోన్‌లో భారీ పేలుడు జరిగింది. రాజధాని ఫ్రీ టౌన్‌లో ఆయిల్‌ ట్యాంకర్‌- ట్రక్కు ఢీకోవడంతో 91 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. బిజీగా ఉన్న మార్కెట్‌ ప్రాంతంలో పేలుడు జరిగింది. మార్కెట్లో షాపింగ్‌కు వచ్చిన వాళ్లు కూడా పేలుడు ధాటికి చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇంధన డిపో సమీపం లోనే పేలుడు జరగడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఆయిల్‌ ట్యాంకర్‌ నుంచి చెలరేగిన మంటలు జనావాసాలకు కూడా వేగంగా వ్యాపించాయి. ప్రమాదం జరిగిన ఆయిల్‌ ట్యాంకర్‌ నుంచి చమురు లీక్‌ కావడంతో తీసుకెళ్లడానికి చాలామంది జనం పోగయ్యారు. ఇదే వాళ్ల పాలిట శాపంగా మారింది. ఆకస్మాత్తుగా పేలుడు జరగడంతో జనం ప్రాణాలు కోల్పోయారు.

ప్రమాదం జరిగిన తీరు..

ఆ దేశ రాజధాని ఫ్రీటౌన్‌లో ఫ్యూయల్  ట్యాంకర్ పేలుడు చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 91 మంది మరణించినట్లుగా తెలుస్తోంది. ట్యాంకర్ ఢీకొని పేలుడు సంభవించి మంటలు వ్యాపించాయని స్థానిక అధికారులు వెల్లడించారు. మొత్తం మరణాల సంఖ్య పెరుగుతున్నట్లుగా వారు వెల్లడించారు. ట్యాంకర్‌ నుంచి లీకవుతున్న ఇంధనాన్ని సేకరించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. పెట్రోల్ ట్యాంక్ నుంచి రోడ్డుపై పోతున్న పెట్రోల్‌ను బాటిల్స్, క్యాన్లు, డబ్బాలతో జనం పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అదే సమయంలో చిన్న మిరుగు ఆ పెట్రోల్‌పై పడింది. వెంటనే ఆ పరిసరాలు మొత్తం అగ్నికి ఆహుతయ్యాయి.

ఇది భయంకరమైన ప్రమాదం అని సియెర్రా లియోన్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ అధిపతి బ్రీమా బిర్ సేసే అన్నారు. కాలిపోయిన వ్యక్తులు.. వారి మృతదేహాలు రోడ్డుపై అలా పడిపోయాయి. అక్కడి పరిస్థితులు భయంకరంగా మారిపోయాయి.

ఈ ప్రమాదంకు సమీపంలో ఉన్న పలు దుకాణాలు, ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. బాధిత కుటుంబాల ఆర్థనాదాలతో ఆ పరిసరాలు హృదయ విదారకంగా మారిపోయాయి.

ఇవి కూడా చదవండి: Google Pay: గూగుల్‌ UPI పిన్‌ని మరిచిపోతున్నారా.. మార్చాలా.. చాలా ఈజీ.. ఎలానో తెలుసుకోండి..

Spectacle Marks: కళ్ల జోడు వాడకంతో ముక్కుపై మచ్చలు ఏర్పడుతున్నాయా.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి..