ఇరాన్‌పై మళ్లీ దాడులకు అమెరికా ప్రయత్నాలు

ఒకప్పుడు ఊళ్లో ఇద్దరు పెద్ద మనుషులు గొడవ పడితే, పక్కింటోళ్లు భయంతో తలుపులు వేసుకుని బిక్కుబిక్కుమని బతికేవాళ్లట. ఎక్కడ జోక్యం చేసుకుంటే అది వాళ్ల బతుకులను ఛీద్రం చేస్తుందోనన్న భయంతో. ఏ కాలంలోనైనా పెద్దోళ్ల పోరు,పేదోళ్లకే నష్టం. ఇప్పుడదే సీన్ మిడిలీస్ట్‌లో రిపీట్ అవుతోంది. అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధం ముదురుతోంది. ఆల్రెడీ మాటల బాంబులు పేలుతున్నాయి. ఆరెండు దేశాల మధ్య యుద్ధం ఆగుతుందో లేదో కానీ, దాని దెబ్బ మాత్రం ప్రపంచం మొత్తం మీద పడుతోంది. మూడుదేశాల ఇగోకు మనమెందుకు భారీమూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది..తెలుసుకుందాం ఇవాళ్టి బర్నింగ్‌టాపిక్‌లో హాట్‌హాట్‌గా...

ఇరాన్‌పై మళ్లీ దాడులకు అమెరికా ప్రయత్నాలు
Iran US Conflict

Updated on: Apr 30, 2026 | 10:10 PM

మాట వింటే మంచోడ్ని, లేకుంటే చండశాసనుడ్ని. మరణమా..శరణమా అంటూ అగ్రరాజ్యాధిపతి ఆగ్రహంతో ఊగిన ప్రతిసారీ,బాబు ట్రంపు పక్కకెళ్లిఆడుకోమ్మా అంటూ ఇరాన్ చాలా కూల్‌గా జవాబిస్తూ వస్తోంది. అమెరికాను చూసి ఇరాన్ భయపడుతుందో లేదో కానీ, ఆదేశ అధ్యక్షుడ్ని మాత్రం కూరలో కరివేపాకులా తీసిపడేస్తోంది. ట్రంప్ తనతో ఢీకొట్టే దమ్ముందా అన్నప్పుడల్లా , ఇరాన్ గమ్మునుండవోయ్ అంటూ వెంటనే సెటైర్‌ వేయడం, దీనికి అమెరికా అధ్యక్షుడు మరింత రెచ్చిపోవడం చూస్తూనే ఉన్నాం. మళ్లీ మరోసారి ఆరెండు దేశాలు మాటలతో హెచ్చరికలు పంపుకున్నాయి.ఈసారి అంతమే అనట్లుగా రెచ్చిపోయాయి. మరి మరోసారి యుద్ధం వస్తే తట్టుకునే స్టేజ్‌లో ప్రంపంచం ఉందా..? ఎవరి ఇగోకు ఎవరు బలౌతున్నారు ? ఫిబ్రవరి 28న మొదలైన ఇరాన్‌-అమెరికా వార్.. కొన్ని లక్షల కోట్ల సంపదను ఆవిరిచేసింది.. కొన్ని వందలమంది ప్రాణాలను తీసింది.. కొన్ని దేశాలను ఆర్దికంగా ఇబ్బందిపెట్టింది.. పశ్చిమాసియాను మరింత పాతాళంలో పడేసింది.. ఓదేశాన్ని 50ఏళ్ల వెనక్కు నెట్టింది… గ్లోబల్‌ మార్కెట్‌ను ఊగిసలాటలో పడేసింది 60ఏళ్ల చరిత్రున్న ఒపెక్‌ గ్రూప్‌ను అతలాకుతలం చేసింది ఒపెక్ గ్రూప్..OPEC. ఆయిల్ ధరలు నియంత్రణకు 60ఏళ్ల కిందట ఏర్పడిన గ్రూప్. ఈగ్రూప్‌లో అనిశ్చితి ఏర్పడితే టోటల్ ప్రపంచమే తలకిందులయ్యే పరిస్థితి. అలాంటి తొలిసారి ఇరాన్‌-అమెరికా యుద్ధం కారణంగా ఒపెక్‌లో అలజడి...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి