Pension Age: పెన్షన్‌ వయస్సు పెంచడంతో.. యుద్ధక్షేత్రంలా మారిన పారిస్‌..

|

Mar 25, 2023 | 6:10 AM

France Protests: పెన్షన్‌ వయస్సు పెంపుదలకు వ్యతిరేకంగా పారిస్‌లో ప్రజాఉద్యమం ప్రకంపనలు రేపుతోంది. ప్రజా ఉద్యమాలతో పారిస్‌ యుద్ధక్షేత్రంలా మారింది.

Pension Age: పెన్షన్‌ వయస్సు పెంచడంతో.. యుద్ధక్షేత్రంలా మారిన పారిస్‌..
France Protests
Follow us on

France Protests: ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌ ఆ దేశ ప్రభుత్వ ఉద్యోగులపై బలవంతంగా రుద్దిన పెన్షన్‌ సంస్కరణలపై ఫ్రాన్స్‌లో జనప్రభంజనం ప్రకంపనలు రేపుతోంది. పారిస్‌లో ఎటుచూస్తే అటు జనం…లక్షలాది మంది రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. ఇటీవల ఫ్రాన్స్‌ ప్రభుత్వం తీసుకొస్తోన్న ఓ చట్టాన్ని తిప్పికొడుతూ ఫ్రాన్స్‌ ప్రజానీకం ఆందోళన బాట పట్టారు. దీంతో గత పదిరోజులుగా ఫ్రాన్స్‌ యుద్ధక్షేత్రంగా మారింది. ఆందోళనలు అగ్గిరేపుతున్నాయి. ప్రొటెస్ట్‌లు.. నిరసన కార్యక్రమాలతో పారిస్‌ దద్దరిల్లుతోంది.

ఫ్రాన్స్‌లో పెన్షన్‌ దారుల వయస్సు పెంచింది అక్కడి ప్రభుత్వం. దీంతో పెన్షన్‌దారుల వయస్సు పెంపుదలకు వ్యతిరేకంగా ఆందోళన బాటపట్టారు జనం. ప్రభుత్వోద్యోగుల పెన్షన్‌ వయస్సును 62 నుంచి 64 ఏళ్ళకు పెంచుతూ చట్టం తెస్తోన్న ఇమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌ విధానాలపై జనం మండిపడుతున్నారు. ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ.. టీచర్లు, ఇతర ప్రభుత్వోద్యోగులందరూ రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వ బలగాలు ప్రజాఉద్యమంపై ఉక్కుపాదం మోపుతోంది.

సెంట్రల్‌ పారిస్‌లో ఆందోళన కారులు షాప్‌లను ధ్వంసం చేశారు. ఫర్నిచర్‌ని ధ్వంసం చేయడంతో ఘర్షణలు చెలరేగాయి. పోలీసులకూ, ఆందోళనకారులకూ మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఆందోళన కారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. స్టన్‌ గ్రెనేడ్స్‌ ఉపయోగించారు. వేలాది మంది పలు నగరాల నుంచి పారిస్‌కి తరలివచ్చారు. వందలాది మందని పోలీసులు అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి

అది అప్రజాస్వామికమని ప్రజలు గళమెత్తి నినదిస్తున్నారు. 35 లక్షల మంది ఉద్యోగులకు సంబంధించిన ప్రజావ్యతిరేక నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఉద్యమం మరింత హింసాత్మకంగా మారే ప్రమాదం ఉన్నదని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..