దారుణం.. షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి

ఊగుతున్న విద్యుత్ తీగ కారుకు తాకడంతో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగినట్టు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో కారులో ఉన్న మరో ఇద్దరు గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ప్రయాణిస్తున్న కారు అకస్మాత్తుగా మంటల్లో కాలి దగ్ధమవడం వల్ల నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

దారుణం.. షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
Car Catches Fire

Updated on: Apr 21, 2025 | 9:44 PM

నేపాల్‌లోని టాప్లేజంగ్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణిస్తున్న కారు అకస్మాత్తుగా మంటల్లో కాలి దగ్ధమవడం వల్ల నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఊగుతున్న విద్యుత్ తీగ కారుకు తాకడంతో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగినట్టు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో కారులో ఉన్న మరో ఇద్దరు గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. తూర్పు నేపాల్‌లోని టాప్లేజంగ్ జిల్లాలో సోమవారం విద్యుత్ షాక్ కారణంగా బొలెరో వాహనం మంటల్లో చిక్కుకుని నలుగురు మృతి చెందారని తెలిపారు. ఫంగ్లింగ్ మునిసిపాలిటీలో వాహనం ఒక స్తంభంపై ఊగుతున్న విద్యుత్ తీగను తాకడంతో మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని పోలీసులు తెలిపారు.

ఇటు, ఉత్తరప్రదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. సూల్తాన్‌పూర్‌ జిల్లా పురే లాలా మజ్రా సోన్‌వర్సా గ్రామంలోని హరీష్ వర్మ అనే వ్యక్తి ఇంట్లో ఆదివారం అర్థరాత్రి అనుమానాస్పద స్థితిలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో హరీశ్ వర్మ రెండేళ్ల కూతురు పూనమ్ సజీవ దహనం కాగా, అతని భార్య గీత(35) తీవ్రంగా కాలిపోయింది. ఇది గమనించిన స్థానికులు మంటలను అదుపులోకి తెచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..