China Market: చైనా ఇక మాకొద్దు బాబోయ్ అంటున్న మరో టెక్ దిగ్గజ సంస్థ.. డ్రాగన్ కంట్రీకి గుడ్ బై

|

Nov 04, 2021 | 12:42 PM

China Market: డ్రాగన్ కంట్రీలో ఓ వైపు ఆహార సంక్షోభం ఎదుర్కొంటున్నట్లు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇపుడు మరో ప్రతికూల పరిస్థితిని..

China Market: చైనా ఇక మాకొద్దు బాబోయ్ అంటున్న మరో టెక్ దిగ్గజ సంస్థ.. డ్రాగన్ కంట్రీకి గుడ్ బై
Yahoo China
Follow us on

China Market: డ్రాగన్ కంట్రీలో ఓ వైపు ఆహార సంక్షోభం ఎదుర్కొంటున్నట్లు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇపుడు మరో ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. చైనాలోని ఉన్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఒకొక్కటిగా విదేశీ టెక్ దిగ్గజ కంపెనీలు వెళ్లిపోతున్నాయి. విదేశీ సాంకేతిక సంస్థలు చైనా లో తమ కార్యకలాపాలను నిర్వహించలేమంటూ ఉపసంహరించు కుంటున్నాయి. ఫోర్ట్‌నైట్, యాహూ, లింక్డ్‌ఇన్ లతో సహా అనేక  ఇతరులు భారీ కంపెనీలు చైనా నుండి నిష్క్రమిస్తున్నాయి. తాము ఇక చైనాలో కార్యక్రమాలను నిర్వహించలేమని అక్కడ నెలకొన్న పరిస్థితులే కారణమని యాహు పేర్కొంది.

చైనాలో పనిచేస్తున్న పాశ్చాత్య కంపెనీలకు అనిశ్చితి ఏర్పడింది. చైనా అతి పెద్ద మార్కెట్‌ అయినప్పటికీ కొత్త చట్టం లోబడి పనిచేయాల్సి రావడం టెక్ కంపెనీలకు ముళ్ళమీద పనిచేస్తున్నట్లు ఉందని మార్కెట్ నిపుణుల వ్యాఖ్య. నిజానికి యాహూకి చెందిన చాల సర్వీసులను చైనా ఇప్పటికే నిలిపివేసింది. అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో చైనా నుంచి యాహు తొలగింది. నవంబర్‌ 1 నుంచి మా సర్వీసులు అందుబాటులో ఉండవు‘ అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే అమెరికన్‌ టెక్‌ దిగ్గజం గూగుల్‌  చైనా నుంచి తప్పుకుంది. మైక్రోసాఫ్ట్‌కి చెందిన ప్రొఫెషనల్‌ నెట్‌వర్కింగ్‌ ప్లాట్‌ఫాం లింక్డ్‌ఇన్‌ సైతం తమ సైట్‌ను చైనాలో క్లోజ్ చేస్తున్నామని అక్టోబర్ లో తెలిపింది.  చైనాలోని

దేశీ దిగ్గజాలు సహా టెక్నాలజీ కంపెనీలపై నియంత్రణను ప్రభుత్వం ఇటీవలి కాలంలో మరింతగా పెంచుతోంది. ఈ పరిస్థితుల మధ్య చైనా నుంచి యాహూ నిష్క్రమించడం కేవలం లాంఛనంగా మాత్రమే మిగిలింది. ‘చైనాలో వ్యాపార నిర్వహణ, చట్టాల అమలుకు సంబంధించిన పరిస్థితులు కఠినతరంగా మారుతున్నాయి. తమ దేశలోని నిబంధనలను ఉల్లంఘించిన కంపెనీలకు 50 మిలియన్ యువాన్లు ($7.8 మిలియన్లు) లేదా వారి వార్షిక ఆదాయంలో 5% వరకు జరిమానా విధిస్తున్నారు. ఇక సాంకేతికత, వాణిజ్యంపై అమెరికా – చైనా మధ్య జరుగుతున్నా గొడవలు కూడా ఈ పరిణామాలకు కారణమని తెలుస్తోంది.

Also Read: పదేళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అయోధ్య.. త్వరలో రామమందిరం నిర్మాణం పూర్తి