Pak Diplomat Confirm Balakot Strike: అవును భారత్ సర్జికల్ స్ట్రైక్స్ నిజమే..త్వరలో లెక్క సరి చేస్తామంటున్న హిలాలీ

సర్జికల్ స్ట్రైక్స్ పై తాజాగా పాకిస్తాన్‌ మాజీ దౌత్యవేత్త హిలాలీ ఓ టీవీ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాయి. భారత్ ఆర్మీ నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ పై పాక్ చేసినవన్నీ..

Pak Diplomat Confirm Balakot Strike: అవును భారత్ సర్జికల్ స్ట్రైక్స్ నిజమే..త్వరలో లెక్క సరి చేస్తామంటున్న హిలాలీ

Updated on: Jan 10, 2021 | 3:37 PM

Pak Diplomat Confirm Balakot Strike: మన దేశ చరిత్రలో మరచిపోలేని విషాద ఘటన జమ్మూకాశ్మీర్ లోని పుల్వామాలో భారత్ ఆర్మీ పై ఉగ్రవాదులు జరిపిన దాడి. సీఆర్‌పీఎఫ్ వాహనంపై టెర్రరిస్టులు జరిపిన దాడిలో 40 మంది భారత సైనికులు అసువులు బాసిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకార చర్యగా రంగంలోకి దిగిన భారత్ వైమానిక దళం.. పాకిస్తాన్ భూభాగంలోకి బాలా కోట్ పై దాడులు చేశాయి. 2019 ఫిబ్రవరి 26న పీవోకే లోని ఉగ్ర స్థావరాలున్న బాలకోట్‌పై భారత వాయు సేన మెరుపు వేగంతో దాడి చేసి ఉగ్రవాదులను మట్టుబెట్టింది. తాము నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ లో దాదాపు 300 వందల మంది మిలిటెంట్స్ మరణించారని మన ప్రభుత్వం , ఇండియా ఆర్మీ ప్రకటించింది. అయితే ఈ దాడుల్లో ఎవరూ మరణించలేదని చెట్లమీద మాత్రమే భారత్ వాయుసేన దాడి చేసిందని అటు పాక్ ప్రభుత్వం చెప్పింది.. ఇక మన ప్రతిపక్ష నాయకులు కూడా తాము ఏమీ తక్కువ కాదు అంటూ.. పాక్ మాటలకు వంత పాడుతూ.. ఇవ్వన్ని గాలి మాటలే.. అంతమంది చనిపోతే.. రక్తం ఎక్కడ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశాయి.

అప్పటి సర్జికల్ స్ట్రైక్స్ పై తాజాగా పాకిస్తాన్‌ మాజీ దౌత్యవేత్త హిలాలీ ఓ టీవీ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాయి. భారత్ ఆర్మీ నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ పై పాక్ చేసినవన్నీ అవాస్తవాలు అని చెప్పారు. నిజానికి ఇండియా అంతర్జాతీయ సరిహద్దును దాటి.. ప్రతీకార చర్యలకు పూనుకుంది. ఈ ఘటనలో కనీసం 300 మంది మరణించారు. ఇందుకు మేం బదులు తీర్చుకుంటాం. కానీ మా లక్ష్యం వేరు. మేం వారి హై కమాండ్‌ని టార్గెట్‌ చేశాం. అది మా చట్టబద్ధమైన లక్ష్యం. ఇక మేం సర్జికల్‌ దాడులు జరిగాయి కానీ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని ప్రకటించాం అది అబద్దం.. భారత్ మాకు ఎంత నష్టం కలిగించిందో మేము కూడా భారత్ కు అంతే నష్టం కలుగచేసి లెక్కలు సరిచేస్తాం.. ఎక్కువ చేయం అంటూ హిలాలీ సంచల కామెంట్స్ చేశారు.

Also Read: అర్ధరాత్రి వేళ భారత్ భూభాగంలోకి చైనా ఆర్మీ జవాన్ … పొరపాటున వచ్చాడు విడుదల చేయమని కోరుతున్న పీఎల్ కే