India China Border News: అర్ధరాత్రి వేళ భారత్ భూభాగంలోకి చైనా ఆర్మీ జవాన్ … పొరపాటున వచ్చాడు విడుదల చేయమని కోరుతున్న పీఎల్‌కే

డ్రాగన్ కంట్రీ విస్తరణ కాంక్షతో ఓ వైపు భారత్, చైనా బోర్డర్ వద్ద పరిస్థితి నివురుగప్పిన నిప్పులానే ఉంది. తాజాగా అర్థరాత్రి వేళ చైనా జవాన్‌ భారత్ సరిహద్దుల్లోకి అక్రమంగా ప్రవేశించడం కలకలం..

India China Border News: అర్ధరాత్రి వేళ భారత్ భూభాగంలోకి చైనా ఆర్మీ జవాన్ ... పొరపాటున వచ్చాడు విడుదల చేయమని కోరుతున్న  పీఎల్‌కే
Follow us

|

Updated on: Jan 10, 2021 | 2:37 PM

India China Border News: డ్రాగన్ కంట్రీ విస్తరణ కాంక్షతో ఓ వైపు భారత్, చైనా బోర్డర్ వద్ద పరిస్థితి నివురుగప్పిన నిప్పులానే ఉంది. తాజాగా అర్థరాత్రి వేళ చైనా జవాన్‌ భారత్ సరిహద్దుల్లోకి అక్రమంగా ప్రవేశించడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్‌సో వద్ద ఎల్‌ఏసీ దాటుకుని ఓ చైనా జవాన్ భారత్ భూభాగంలోకి అడుగు పెట్టాడు. తూర్పు లద్దాఖ్‌ లోని పగోంగ్ యొక్క దక్షిణ ఒడ్డున అతను సంచరిస్తుండగా ఇండియన్ ఆర్మీ శుక్రవారం అరెస్ట్ చేసింది.

ఇదే విషయంపై ఆదివారం ఉదయం చైనా ఆర్మీ అధికారులు స్పందించారు. తమ సైనికుడు చీకటిలో దారి తప్పి ప్రమాదవశాత్తూ భారత్ భూభాగంలోకి ప్రవేశించాడని చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ ఓ ప్రకటన విడుదల చేసింది. అతడిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా సురక్షితంగా విడుదల చేయాలని భారత ఆర్మీ అధికారులను విజ్ఞప్తి చేసింది. సరిహద్దుల్లో శాంతిని కొనసాగించాలని కోరింది పీఎల్ కే.

అయితే చైనా సైనికుడు ప్రవేశంపై ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయని భారత్‌.. అతన్ని విచారించిన అనంతరం విడుదల చేస్తామని తెలిపింది. గత ఏడాదిలో వాస్తవాధీన రేఖ వద్ద చైనా, ఇండియా ఆర్మీ మధ్య ఘర్షణ చోటు చేసుకొన్న విషయం తెలిసిందే. గల్వాన్‌ లోయలో చోటుచేసుకున్న హింసాత్మక ఘర్షణల అనంతరం ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడ్డాయి. అనంతరం ఇరు దేశాల సైనిక అధికారుల చొరవతో సుదీర్ఘ చర్చల అనంతరం శాంతి నెలకొంది.

Also Read: ఏపీలో వేగంగా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ.. మాయం కానున్న తూర్పు, పశ్చిమ కృష్ణా జిల్లాలు

Latest Articles