Forest Bathing: జపనీయులు వారానికి ఒక్కసారైనా అడవి స్నానం చేస్తారట.. ఎందుకో తెలుసా..?

|

Mar 21, 2022 | 5:47 AM

Forest Bathing: అడవుల్లో అడుగు పెడితే చాలు రకరకాల చెట్లు, వాటి ఆకుల నుంచి కిందికి చొచ్చుకువచ్చే సూర్యకిరణాలు.. ఒకదానికొకటి..

Forest Bathing: జపనీయులు వారానికి ఒక్కసారైనా అడవి స్నానం చేస్తారట.. ఎందుకో తెలుసా..?
Forest Bathing
Follow us on

Forest Bathing: అడవుల్లో అడుగు పెడితే చాలు రకరకాల చెట్లు, వాటి ఆకుల నుంచి కిందికి చొచ్చుకువచ్చే సూర్యకిరణాలు.. ఒకదానికొకటి పెనవేసుకున్న చెట్ల కొమ్మలు, అడవుల్లో ఎగురుతున్న పక్షులు.. ఇలా అన్నింటిని చూస్తుంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో కొన్ని రోగాలు కూడా మటుమాయం అవుతుంటాయని చెబుతుంటారు నిపుణులు. ఒత్తిళ్ల ను దూరం చేసుకోవచ్చు. మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది. అడవుల్లో కూర్చుని ధ్యానంలోకి వెళ్లిపోతే ఎంతో బాగుంటుంది. ఆహ్లాదకరమైన గాలిని పిలుస్తూ ధ్యానంలోకి వెళ్లిపోతే మనస్సుకు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. అలాగే అడవి స్నానం చేస్తే ఎంతో మేలంటున్నారు నిపుణులు. నిమిషాల వ్యవధిలోని ఒత్తిడి నుంచి బయటపడవచ్చు. ఆ ప్రభావం వల్ల గుండె సమస్యలు (Heart problems), రక్తపోటు తగ్గుతాయి. ఒత్తిడి కలిగించే హార్మోన్ల విడుదల ఆగి పోతుంది. చెట్లు ఆక్సిజన్‌ను మాత్రమే కాకుండా ఎన్నో అత్యవసర తైలాలను విడుదల చేస్తాయని ‘వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం’ అధ్యయనం వెల్లడించింది. మొత్తానికి ‘ఫారెస్ట్‌ బాత్‌’ అలవాటు చేసుకొంటే .. ఒత్తిడి నుంచి విముక్తి, మానసిక ఆనందం రెండూ కూడా సొంతం చేసుకోవచ్చు.

అయితే అడవి స్నానమంటే జపాన్‌ ప్రజలు ఎంతో ఇష్టపడతారట. ఆకుపచ్చ చెట్ల మధ్య పరిసరాలను పరిశీలిస్తూ ప్రశాంతంగా గడపడమే వీరి పని. జపాన్‌ ప్రజలు ఈ విధానాన్ని అనుసరిస్తూ సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతున్నారు. ప్రతి జపనీయుడూ వారానికి ఒక గంటసేపు అయినా అడవిలో గడుపుతాడట. ఒత్తిళ్ల నుంచి దూరం అయ్యేందుకు షిన్రిన్‌-యోకు పేరుతో జాతీయ ఆరోగ్య కార్యక్రమం ప్రారంభమైంది. ఇలా జననీయులు వారంలో ఒకసారి అడవిలో స్నానం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారట. దీనిని శాస్త్రీయంగా కూడా నిరూపించారు నిపుణులు.

ఇవి కూడా చదవండి:

Curry Leaves: కూరలో కరివేపాకు అని తీసిపారేస్తున్నారా.. అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే

Specialised Fibre: శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ.. మీ హార్ట్‌ రేట్‌ తెలుసుకోవాలా.. అయితే ఈ డ్రస్‌ వేసుకోండి