మయన్మార్ లో ఆంగ్ సాన్ సూకీ 76 వ బర్త్ డే…… విడుదల చేయాలంటూ దేశ వ్యాప్తంగా పూలతో నిరసన తెలిపిన మద్దతుదారులు

| Edited By: Phani CH

Jun 19, 2021 | 6:10 PM

మయన్మార్ లో నిర్బంధంలో ఉన్న ప్రజానేత ఆంగ్ సాన్ సూకీని విడుదల చేయాలని కోరుతూ ...ఆమె 76 వ జన్మదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం వేలాది మద్దతుదారులు పూలతో ప్రదర్శనలు నిర్వహించారు.

మయన్మార్ లో ఆంగ్ సాన్ సూకీ 76 వ బర్త్ డే...... విడుదల చేయాలంటూ దేశ వ్యాప్తంగా పూలతో నిరసన తెలిపిన మద్దతుదారులు
Flower Protest In Myanmar
Follow us on

మయన్మార్ లో నిర్బంధంలో ఉన్న ప్రజానేత ఆంగ్ సాన్ సూకీని విడుదల చేయాలని కోరుతూ …ఆమె 76 వ జన్మదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం వేలాది మద్దతుదారులు పూలతో ప్రదర్శనలు నిర్వహించారు. ముఖ్యంగా అనేకమంది మహిళలు తమ హెయిర్ లో పూలను అలంకరించుకుని ఈ వెరైటీ ప్రొటెస్ట్ లో పాల్గొన్నారు. సూకీ తరచూ తనకిష్టమైన పుష్పాన్ని అలంకరించుకుంటారని ఆమె సపోర్టర్లు తెలిపారు. ఫ్రీడమ్ ఫర్ ఫియర్…హ్యాపీ బర్త్ డే మదర్ సూకీ..మీ వెంటే మేమున్నాం అంటూ వీరు నినాదాలు చేశారు. గత ఫిబ్రవరి 1 న సూకీని నిర్బంధించిన సైనిక ప్రభుత్వం దేశంలో అధికారాన్ని చేపట్టింది. సూకీతో బాటు అనేకమందిని రాజకీయ ఖైదీలుగా జైలుకు తరలించింది. అప్పటి నుంచి మయన్మార్ లో దాదాపు ప్రతి రోజూ నిరసన ప్రదర్శనలు జరుగుతూ వచ్చాయి. సైన్యం, పోలీసుల కాల్పుల్లో 800 మందికి పైగా మరణించగా.. వెయ్యిమంది వరకు గాయపడ్డారు. పోలీసుల, సైనికాధికారుల ఆదేశాలను పాటించలేక పెద్ద సంఖ్యలో పోలీసులు వారి కుటుంబాలతో సహా పారిపోయి వచ్చి భారత -మయన్మార్ సరిహద్దుల్లోని మిజోరం రాష్ట్రానికి తరలి వచ్చారు. తమకు ఇక్కడ ఆశ్రయం కల్పించాలని భారత ప్రభుత్వాన్ని కోరారు.

కాగా ఇటీవలే ఆంగ్ సాన్ సూకీపై సైనిక ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేసింది. అధికారంలో ఉండగా ఆమె భారీ ఎత్తున బంగారాన్ని, లక్షలాది డాలర్లను చట్టవిరుద్ధంగా సేకరించారని, ఇది అవినీతి కాక మరేమిటని పేర్కొంది. ప్రభుత్వ అధీనం లోని రెండు బంగళాలను ఆమె అక్రమంగా అద్దెకు ఇచ్చిందని తెలిపింది. ఇప్పటికే ఆమెపై కోర్టులో కేసు కూడా పెట్టింది. సోమవారం కూడా సూకీ కోర్టు విచారణకు హాజరు కావలసి ఉంది. అటు-సూకీ ఎన్నికను గౌరవించాలని, ఆమెతో బాటు నిర్బంధంలో ఉన్న వారినందరినీ విడుదల చేయాలని ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధుల సభ మయన్మార్ సైనిక ప్రభుత్వాన్ని కోరింది. ఆ దేశానికి ఆయుధాల సరఫరాను నిలిపివేయాలని ఆయా దేశాలను ఆ అభ్యర్థించింది.

 

మరిన్ని  ఇక్కడ చూడండి: Group Attack: గుంటూరులో ఆకతాయిల హల్ చల్.. పెట్రోల్ బంక్ వర్కర్‌పై దాడి.. ఆపై కాళ్ల బేరానికి..

అనుమానాస్పద స్థితిలో ప్రముఖ చైనీస్ అణు శాస్త్రజ్ఞుని మృతి……పోలీసుల దర్యాప్తు ప్రారంభం