Covid Vaccination For Animals: ప్రపంచాన్ని భయపెట్టిన కరోనా మహమ్మారి భయపెడుతూ వ్యాక్సినేషన్ ప్రక్రియ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. భారత్‌లో ఇప్పటికే తొలి విడదల వ్యాక్సినేషన్ పూర్తికాగా.. రెండో విడత శరవేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే భారత్‌కు చెందిన వ్యాక్సిన్లు ప్రపంచ దేశాలకు సైతం ఎగుమతులు అవుతున్నాయి.
ఇదిలా ఉంటే కరోనా వైరస్ కేవలం మనుషులకే కాకుండా జంతువులకు కూడా సోకిన ఘటనలను మనం చూశాం. కొన్ని దేశాల్లోని జూలలో జంతువుల్లో కోవిడ్-19 వైరస్‌ను పరిశోధకులు గుర్తించారు. మనుషులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.. మరి జంతువులు పరిస్థితి ఏంటి.? అని ఎప్పుడైనా ఆలోచించారా.
తాజాగా ఈ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ప్రపంచంలో తొలిసారి గ్రేట్ ఏప్స్ (కోతి జాతుల్లో ఒకటి)కి వ్యాక్సిన్ ఇచ్చారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ఓ జంతు ప్రదర్శన శాలలో ఉన్న ఏప్స్‌కి వ్యాక్సినేషన్ చేశారు. జంతువుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ వ్యాక్సిన్‌ను ఒకేసారి రెండు డోసులు ఇస్తారు. సాధారణంగా మనుషులకు ఒకసారి ఒకే డోస్ ఇస్తారనే విషయం తెలిసిందే. ఇక జంతువుల కోసం ఈ వ్యాక్సిన్‌ను వెటెరినరీ ఫార్మాస్యూటికల్ కంపెనీ రూపొందించింది. ఈ వ్యాక్సిన్ టెస్ట్‌లో భాగంగా ఏప్స్‌కు వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టారు. ఈ జూలో ఉన్న 9 ఏప్స్‌కు వ్యాక్సినేషన్ చేపట్టారు. ఇక జూ సిబ్బంది వల్ల ఈ జంతువులకు కరోనా వ్యాపించింది. ఇదిలా ఉంటే ఏప్స్‌తో పాటు జూలో ఉన్న గొరిల్లాలకు కూడా కరోనా సోకింది. కానీ వాటిలో యాంటీ బాడీలు ఉత్పత్తి కావడంతో వాటికి వ్యాక్సిన్ ఇవ్వలేదు. మరి ఈ వ్యాక్సిన్ జంతువులపై సరిగ్గా పనిచేస్తుందా.? ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా.. అన్న విషయాలు తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.