అమెరికాలో దారుణం.. వీడని మిస్టరీ
అమెరికాలోని అయోవాలో విషాదం నెలకొంది. వెస్ట్ డె మెయిన్స్‌లో తెలుగు కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. చంద్రశేఖర్ సుంకర, లావణ్య సుంకర, వారి ఇద్దరు పిల్లలు కాల్పులకు బలయ్యారు. వారి శరీరంపై తుపాకీ గాయాలుండటంతో అనుమానాస్పద స్థితిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చంద్రశేకర్ సుంకర.. భార్యా ఇద్దరి పిల్లలతో కలిసి అమెరికాలో స్థిరపడ్డాడు. అతని తల్లిదండ్రులు అమెరికాలో నివాసం ఉంటున్నారు. ఈ ఏడాది మార్చి 25న అయోవా రాష్ట్రంలోని వెస్ట్-డె-మెయిన్స్‌లో ఓ […]

అమెరికాలోని అయోవాలో విషాదం నెలకొంది. వెస్ట్ డె మెయిన్స్‌లో తెలుగు కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. చంద్రశేఖర్ సుంకర, లావణ్య సుంకర, వారి ఇద్దరు పిల్లలు కాల్పులకు బలయ్యారు. వారి శరీరంపై తుపాకీ గాయాలుండటంతో అనుమానాస్పద స్థితిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చంద్రశేకర్ సుంకర.. భార్యా ఇద్దరి పిల్లలతో కలిసి అమెరికాలో స్థిరపడ్డాడు. అతని తల్లిదండ్రులు అమెరికాలో నివాసం ఉంటున్నారు. ఈ ఏడాది మార్చి 25న అయోవా రాష్ట్రంలోని వెస్ట్-డె-మెయిన్స్‌లో ఓ ఇంటిని కొనుగోలు చేసినట్లు పోలీసులకు డాక్యుమెంట్లు లభించాయి. అదే ఇంట్లో మరో కుటుంబం కూడా అద్దెకు ఉంటున్నట్లు సమాచారం. చంద్రశేఖర్ సుంకర కుటుంబసభ్యులు.. రక్తపు మడుగులో పడి ఉండటంతో భయంలో పరుగులు తీసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.