సాధారణంగా పాములను చూడగానే భయంతో వణికిపోతాం. దాని దగ్గరికి వెళ్లే సాహసం కూడా చేయం. ఇటీవల అడువులు, కొండ ప్రాంతాలు ఆక్రమణలకు గురికావడంతో అడవిలో ఉన్న పాములు, కొండచిలువలు జనావాసాల్లోకి వస్తున్నాయి. సమీప ఇళ్లు, ఆలయాల్లోకి చొరబడుతున్నాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అలాంటి సంఘటనకు సంబంధించిన ఫొటో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరానికి చెందిన జోష్ కాస్ట్‌లీ ఓ స్నేక్ క్యాచర్. రకరకాల పాములను పట్టి ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. ఇటీవల అతను తన కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా పిక్నిక్‌కు వెళ్లాడు.
ఇందులో భాగంగా క్వీన్స్‌లాండ్‌కు బయలుదేరిన జోష్ బుష్‌లాండ్ అనే ఓ టూరిస్ట్ స్పాట్‌కు రాగానే బయట కార్ పార్క్ చేశాడు. తన కుటుంబ సభ్యులందరినీ తీసుకుని లోపలికి వెళ్లిపోయాడు. అయితే కారును పార్క్ చేసేటప్పుడు కిటికీని సరిగ్గా మూయలేదు. దీంతో వారు బయటకు రాగానే ఓ పెద్ద పాము కారులోకి ప్రవేశించింది. ఇంటికి బయలుదేరుదామని కారు వద్దకు వచ్చిన జోష్ కుటుంబ సభ్యులు కారు అద్దానికి చుట్టుకుని ఉన్న కొండచిలువను చూసి ఆశ్చర్యపోయారు. అయితే స్వయంగా స్నేక్ క్యాచర్ అయిన జోష్ ఈసారిమాత్రం కొండ చిలువను పట్టుకునే ప్రయత్నం చేయలేదు. మరో స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించాడు. దీంతో అతను అక్కడికి చేరుకుని కొండచిలువను పట్టుకున్నాడు. అనంతరం సమీప అడవి ప్రాంతంలో దానిని వదిలిపెట్టాడు. ఈ క్రమంలో తనకు ఎదురైన అనుభవాన్ని వివరిస్తూ కొండచిలువ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు జోష్. దీంతో ఇవి కాస్తా వైరల్‌గా మారాయి. దీన్ని చూసిన వారందరూ ‘వామ్మో.. ఎంత భయంకరంగా ఉందో’, ‘ జోష్.. మీ అదృష్టం బాగుంది’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా పాములు పట్టుకునే ప్రయత్నంలో ఒకసారి ప్రమాదవశాత్తూ పాము కాటుకు గురయ్యాడు జోష్. సమయానికి చికిత్స అందడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.
Viral Video: పుంజుకు తన పెట్టను చేరుకోవడం తెలీదా.. నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో
Elephant Attack: స్టూడెంట్స్ వాహనంపై ఏనుగు దాడి.. విద్యార్థులు పరుగో పరుగు.. వీడియో వైరల్…
Viral Video: వీరికి అవార్డ్ అయితే ఇవ్వాల్సిందే.. ఏం పేరు పెడతారో మీరే డిసైడ్ చెయ్యండి