AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Elon Musk: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ‘ఏలియన్‘ అంటా…. వైరల్‌గా మారిన ఫన్నీ ట్వీట్..

Elon Musk Funny Tweet Goes Viral: తన వినూత్న నిర్ణయాలు, ఎత్తుగడలతో వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించాడు టెస్లా కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్. తాజాగా ఎలాన్ ప్రపంచ కుబేరుడిగా అవతరించిన విషయం తెలిసిందే. ఇక...

Elon Musk: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ‘ఏలియన్‘ అంటా.... వైరల్‌గా మారిన ఫన్నీ ట్వీట్..
Narender Vaitla
|

Updated on: Feb 12, 2021 | 10:05 PM

Share

Elon Musk Funny Tweet Goes Viral: తన వినూత్న నిర్ణయాలు, ఎత్తుగడలతో వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించాడు టెస్లా కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్. తాజాగా ఎలాన్ ప్రపంచ కుబేరుడిగా అవతరించిన విషయం తెలిసిందే. ఇక వ్యాపారంలో ఎంత బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటాడు ఎలాన్. ట్విట్టర్ వేదికగా అడపాదడపా పలు ఆసక్తికరమైన, ఫన్నీ కామెంట్లు పెడుతూ అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటాడు. ఈ క్రమంలో తాజాగా భారత్‌కు చెందిన క్రెడిట్ క్లబ్ సీఈఓ కునాల్ షా చేసిన ఓ ట్వీట్‌కు ఎలాన్ ఫన్నీ కామెంట్ చేశాడు. ఇంతకీ కునాల్ పెట్టిన పోస్ట్ ఏంటి.. దానికి ఎలాన్ ఇచ్చిన కామెంట్ ఏంటనేగా మీ సందేహం. కునాల్ ట్విట్టర్ వేదికగా.. ‘ఎలాన్ మస్క్ ఇంత చిన్న వయసులో 500 బిలియన్ల డాలర్ల విలువైన నాలుగు కంపెనీలను అసలు ఒకేసారి ఎలా నడుపుతున్నాడు.? అతను వీటిని ఎలా నిర్వహిస్తున్నాడో నాకు తెలుసుకోవాలనుంది. అతని ఆర్గనైజేషన్‌లను ఎలా మెయింటెన్ చేస్తున్నాడు. ఇలా నాకు ఎన్నో ప్రశ్నలున్నాయి’ అంటూ ట్వీట్ చేశాడు.

ఇక ఈ ట్వీట్‌పై చాలా కూల్‌గా, ఫన్నీగా స్పందించాడు ఎలాన్ మస్క్.. సింపుల్‌గా ‘నేను ఏలియన్‌ను’ అంటూ కామెంట్ చేశాడు. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. సవా లక్ష వ్యవహారాలతో నిత్యం బిజీగా ఉండే మస్క్ ఇలా ట్వీట్‌పై స్పందించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Also Read: America President: తస్మాత్ జాగ్రత్త.. లైట్ తీసుకుంటే చైనా మన భోజనాన్ని కూడా తినేస్తుంది.. బైడెన్ వార్నింగ్..