Israel: ఇజ్రాయెల్ పార్లమెంట్ మరోసారి రద్దు.. మళ్లీ ఎన్నికలకు డేట్ ఫిక్స్

|

Jun 30, 2022 | 7:26 PM

ఇజ్రాయెల్(Israel) లో రాజకీయ సంక్షోభం తీవ్రమయింది. వివిధ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, దానిని విజయవంతంగా ముందుకు కొనసాగించడంలో ప్రభుత్వం విఫలమైంది. పార్లమెంటును రద్దు చేసి మళ్లీ....

Israel: ఇజ్రాయెల్ పార్లమెంట్ మరోసారి రద్దు.. మళ్లీ ఎన్నికలకు డేట్ ఫిక్స్
Israel Parliament
Follow us on

ఇజ్రాయెల్(Israel) లో రాజకీయ సంక్షోభం తీవ్రమయింది. వివిధ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, దానిని విజయవంతంగా ముందుకు కొనసాగించడంలో ప్రభుత్వం విఫలమైంది. పార్లమెంటును రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. దీనికి ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌ ఆమోదం తెలపింది. అంతే కాకుండా నవంబర్‌లో ఎన్నికలు జరపనున్నట్లు వెల్లడించింది. తాజా పరిణామాలతో నఫ్తాలీ బెన్నెట్‌ అత తక్కువ వ్యవధిలోనే ప్రధాని పదవిని కోల్పోవాల్సి వచ్చింది. రెండు నెలలుగా పార్లమెంట్​లో మెజారిటీ లేకుండానే బెన్నెట్ అధికారంలో ఉన్నారు. తాజాగా నిర్వహించిన చర్చలు పార్లమెంట్ రద్దుకు కారణమయ్యాయి. కాగా మూడేళ్ల వ్యవధిలో ఐదోసారి ఎన్నికలు జరగడం గమనార్హం. 12ఏళ్ల పాటు అధికారంలో కొనసాగిన బెంజిమిన్ నెతన్యాహును గద్దె దించతూ గతేడాది జనవరిలో ఇజ్రాయెల్ ప్రధానిగా నాఫ్తాలి బెన్నెట్ అధికారం చేపట్టిన విషయం తెలిసిందే. ఎన్నికలు పూర్తయి, కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకూ లాపిడ్‌ ఆపద్ధర్మ ప్రధాన మంత్రిగా కొనసాగనున్నారు.

పాలనా వ్యవహారాలు, కొత్తగా ఎన్నికల తేదీలపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పార్లమెంటును రద్దు చేయాలనే ప్రతిపాదన వచ్చింది. దీనికి 92 మంది చట్టసభ సభ్యులు ఆమోదం తెలిపారు. కేవలం తొమ్మిది మంది మాత్రమే వ్యతిరేకించారు. దీంతో ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌ మరోసారి రద్దయ్యింది. నవంబర్‌ 1న ఎన్నికలు జరగనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..