
ఆదివారం అర్ధరాత్రి తర్వాత భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2:41 గంటలకు టిబెట్‌లో బలమైన భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) ప్రకారం ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.7గా నమోదైంది. NCS ప్రకారం భూకంప కేంద్రం టిబెట్ ప్రాంతంలో ఉంది. అయితే ఇప్పటివరకు ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం గురించి ఎటువంటి సమాచారం అందలేదు. అయితే ఈ భూకంపం ప్రభావం మన దేశంలోని ప్రధాన నగరాలైన ఉత్తరప్రదేశ్, బీహార్‌లలో కూడా కనిపించింది. దీంతో ఈ ప్రాంతంలోని భౌగోళిక కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఎన్‌సిఎస్ సమాచారం ఇచ్చింది. అదే సమయంలో, పరిపాలన.. విపత్తు నిర్వహణ బృందాలు అప్రమత్తం అయ్యాయి. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి.
An earthquake with a magnitude of 5.7 on the Richter Scale hit Tibet at 02.41 am (IST) today: National Center for Seismology (NCS) pic.twitter.com/NiHQVlTWWi
ఇవి కూడా చదవండి— ANI (@ANI) May 11, 2025
టిబెట్‌లో ఈ రోజు అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం టిబెట్‌ను కుదిపేసింది. భూకంపం ఎంత బలంగా వచ్చిందంటే అర్ధరాత్రి నిద్రపోతున్న టిబెటన్ ప్రజలు భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీయాల్సి వచ్చింది. అయితే ఈ భూకంపం వల్ల ఎంత నష్టం జరిగింది అనే విషయంపై ఎటువంటి సమాచారం లేదు.
ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాలలో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ , బీహార్ సరిహద్దు ప్రాంతాలలో కూడా భూకంప ప్రకంపనలు సంభవించాయి. ప్రజలు తమ అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు, కొందరు తేలికపాటి ప్రకంపనల గురించి మాట్లాడారు, మరికొందరు దీనిని భయానక సంఘటనగా పేర్కొన్నారు.
ఈ భూకంప కేంద్రం టిబెట్‌లో ఉందని..దీని తీవ్రత మధ్యస్థం నుంచి ఎక్కువగా ఉందని NCS తెలిపింది. భూకంప దృక్కోణంలో చూస్తే హిమాలయ ప్రాంతం చాలా సున్నితంగా ఉంటుందని.. ఇటువంటి సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఈ ప్రాంతంలోని భౌగోళిక కదలికలను తాము నిఘా ఉంచుతున్నామని ఎన్‌సిఎస్ తెలిపింది. తద్వారా ఏదైనా ప్రమాదాన్ని సకాలంలో అంచనా వేయవచ్చని చెప్పారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..