AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Donald Trump: మరో టారిఫ్ బాంబు పేల్చిన ట్రంప్‌..! ఇక నుంచి వాటిపై కూడా 100 శాతం పన్ను

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అమెరికా బయట నిర్మించే సినిమాలపై 100 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిత్ర పరిశ్రమ, ముఖ్యంగా హాలీవుడ్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. చట్టపరమైన, వాణిజ్య నియమాల ఉల్లంఘనలపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Donald Trump: మరో టారిఫ్ బాంబు పేల్చిన ట్రంప్‌..! ఇక నుంచి వాటిపై కూడా 100 శాతం పన్ను
Donald Trump
SN Pasha
|

Updated on: Sep 29, 2025 | 10:00 PM

Share

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ఒక షాకింగ్ ప్రకటన చేశారు. అమెరికా బయట నిర్మించే ప్రతి సినిమాపై 100 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపనుంది. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో ఈ ప్రకటన చేశారు. పిల్లల నుంచి మిఠాయి లాక్కున్నట్లుగా, ఇతర దేశాలు అమెరికా చిత్ర పరిశ్రమను మన నుంచి లాక్కున్నారని ట్రంప్‌ పేర్కొన్నారు. అయితే ఈ నిర్ణయం అమలు జరిగితే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిత్రనిర్మాతలు, ప్రేక్షకులపై ప్రభావం పడనుంది.

హాలీవుడ్‌పై తీవ్ర ప్రభావం..

ట్రంప్ ప్రకటన హాలీవుడ్‌లోని ప్రధాన స్టూడియోలు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఆందోళనను పెంచింది. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ, కామ్‌కాస్ట్, పారామౌంట్, స్కైడాన్స్, నెట్‌ఫ్లిక్స్ వంటి ప్రధాన కంపెనీలు ట్రంప్‌ ప్రకటనపై ఇంకా ‍స్పందించలేదు. నిజానికి సినిమాలు ఇకపై యునైటెడ్ స్టేట్స్‌లో ప్రత్యేకంగా నిర్మించరు. వాటి షూటింగ్, నిధులు, పోస్ట్-ప్రొడక్షన్, VFX (విజువల్ ఎఫెక్ట్స్) పనులు ప్రపంచవ్యాప్తంగా జరుగుతాయి. అందువల్ల ట్రంప్ 100 శాతం టారిఫ్ నిర్ణయం ఎలా? ఏ చిత్రాలపై అమలు అవుతుందో అర్థం చేసుకోవడం కష్టంగా మారనుంది. విదేశీ చిత్రాలపై పన్ను విధించడానికి ఏదైనా చట్టపరమైన ఆధారం ఉందా అని కూడా చాలా మంది నిపుణులు ఆలోచిస్తున్నారు.

ఈ నిర్ణయం వాణిజ్య నియమాలకు విరుద్ధమా?

ట్రంప్ ప్రతిపాదించిన సుంకాల గురించి చట్టపరమైన, వాణిజ్య నిపుణులు తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. సినిమాలు మేధో సంపత్తి అని, ప్రపంచ సేవల వాణిజ్యంలో భాగమని వారు వాదిస్తున్నారు. ఈ రంగంలోని విదేశీ మార్కెట్ల నుండి అమెరికా తరచుగా లాభం పొందుతుంది, కాబట్టి అలాంటి సుంకాల విధానాన్ని అంతర్జాతీయ వాణిజ్య నియమాల ఉల్లంఘనగా పరిగణించవచ్చు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి