Trump Buddha Statues: అధ్యక్ష పదవి పోయినా చైనాలో ట్రంప్.. ట్రంపే.. కూర్చోబెట్టి మరీ మార్కెట్లో అమ్మేస్తోన్న డ్రాగన్ కంట్రీ

|

Mar 12, 2021 | 6:55 PM

Trump Buddha Statues: అమెరికా అధ్యక్ష పదవి పోయినా కాని డోనాల్డ్ ట్రంప్ వాల్యూ చైనాలో ఏమాత్రం తగ్గడంలేదు. డ్రాగన్ కంట్రీలో ట్రంప్.. ఎప్పటికీ ట్రంపే. కాకపోతే ఆయన్ను..

Trump Buddha Statues: అధ్యక్ష పదవి పోయినా చైనాలో ట్రంప్.. ట్రంపే..  కూర్చోబెట్టి మరీ మార్కెట్లో అమ్మేస్తోన్న డ్రాగన్ కంట్రీ
Trump Budda China
Follow us on

Trump Buddha Statues: అమెరికా అధ్యక్ష పదవి పోయినా కాని డోనాల్డ్ ట్రంప్ వాల్యూ చైనాలో ఏమాత్రం తగ్గడంలేదు. డ్రాగన్ కంట్రీలో ట్రంప్.. ఎప్పటికీ ట్రంపే. కాకపోతే ఆయన్ను బౌద్ధ సన్యాసిలా కూర్చోబెట్టి మరీ మార్కెట్లో అమ్మేస్తున్నారు, కొనేస్తున్నారు చైనా సోదరులు. ఇలా కూడా డ్రాగన్ కంట్రీ ట్రంప్ ను వాడేసుకుంటోంది. ఇప్పుడీ ట్రంపు విగ్రహాలు చైనా ఈ-కామర్స్ సైట్ ను షేక్ చేస్తున్నాయి. ధ్యానముద్ర లో ఉన్న ట్రంప్ విగ్రహాల ధర 150 నుంచి 610 డాలర్ల ఖరీదు పలుకుతున్నాయి. అయితే, చైనీయులు కేవలం ఫన్ కోసమే ట్రంప్ నమూనాలు కొంటున్నారని గ్లోబల్ టైమ్స్ చెబుతోంది. కరోనా మహమ్మారి విషయంలో చైనాపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ఏకంగా చైనా వైరస్ అంటూ అనేక మార్లు సంబోధించారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అయినా కాని ముఖ్యంగా చైనాలో ఆయనను అభిమానిస్తున్న వారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.

బుద్దుడి మాదిరి ధ్యానముద్రలో ఉన్నట్టున్న ట్రంప్ విగ్రహం చైనీస్ ఈ-కామర్స్ సంస్థ కు సిరులు కురిపిస్తోంది. పద్మాసనంలో కూర్చొని, చేతులను ఒళ్లో పెట్టుకుని, కళ్లు మూసుకుని ధ్యానం చేస్తున్నట్టున్న ట్రంప్ విగ్రహం అక్కడి జనాలను ఆకట్టుకుంటోంది. అంతేనా, బుద్దిజం అందరి కంటే ఎక్కువ తెలిసిన వ్యక్తి ట్రంప్ అని దానికి టైటిల్ పెట్టి అమ్మేస్తున్నారు. జావోబావో అనే కంపెనీ ఈ విగ్రహాలను అమ్ముతోంది. చెనాకు చెందిన ప్రఖ్యాత అలీబాబా సంస్థకు చెందినదే ఈ కంపెనీ. 1.6 మీటర్ల ఎత్తున్న ఈ విగ్రహాలను 999 చైనీస్ యువాన్లకు (150 యూఎస్ డాలర్లు) విక్రయిస్తున్నారు. పెద్ద సైజును 610 డాలర్లకు అమ్ముతున్నారు.

Read also : Telugu States MLC elections : ఎమ్మెల్సీ ఎన్నికల్లో జోరుగా డబ్బు పంపిణీ, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి