AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డీజిల్ ధరలు తగ్గుతాయా..? రష్యాతో ట్రంప్ కీలక ఒప్పందం.. అసలు కథ ఇదే

అమెరికాలో పెరుగుతున్న ఇంధన ధరలను అదుపు చేసే ప్రయత్నంలో భాగంగా రష్యా నుంచి భారీగా డీజిల్ సరఫరా చేసేందుకు ఒప్పందం కుదిరిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. పుతిన్‌తో చర్చల అనంతరం రష్యా డీజిల్‌పై ఆంక్షలకు అమెరికా తాత్కాలిక మినహాయింపు ఇచ్చింది.

డీజిల్ ధరలు తగ్గుతాయా..? రష్యాతో ట్రంప్ కీలక ఒప్పందం.. అసలు కథ ఇదే
Trump Putin Deal
Shaik Madar Saheb
|

Updated on: Oct 10, 2026 | 7:06 AM

Share

రష్యా నుంచి చమురు, గ్యాస్‌ను కొనుగోలు చేసే దేశాలపై భారీ సుంకాలు విధిస్తామంటూ ఇన్నాళ్లూ తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ యూటర్న్‌ తీసుకున్నారు. డీజిల్‌ కొనుగోళ్ల కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో అనూహ్యంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. త్వరలో యూఎస్‌లో మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఇంధన ధరల పెరుగుదల అమెరికాలో తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న ఇంధన ధరలను అదుపులోకి తీసుకురావడమే ధ్యేయంగా.. ఆ దేశంతో ఒక భారీ ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఖరారు చేసినట్లు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. రష్యా డీజిల్‌పై ఆంక్షలను 2027 ఏప్రిల్‌ వరకు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో శుక్రవారం ఫోన్‌లో చర్చలు జరిపిన అనంతరం ఈ ప్రకటన చేశారు. అమెరికాతో పాటు ప్రపంచ మార్కెట్లకు.. రష్యా నుంచి భారీగా డీజిల్‌ సరఫరా అవతుందని.. ధరలు వేగంగా తగ్గుతాయని ట్రంప్ తెలిపారు.

మూడు లక్షల టన్నులకుపైగా డీజిల్‌ను అమెరికాకు, అంతర్జాతీయ విపణికి రష్యా తక్షణమే సరఫరా చేసేలా తమ చర్చల్లో ఒప్పందం కుదిరిందంటూ ‘ట్రూత్‌ సోషల్‌’లో ట్రంప్‌ పోస్టు పెట్టారు. నవంబరులో మరో 5 లక్షల టన్నుల డీజిల్‌ను.. ఆ తర్వాత వెంటనే ఇంకో 10 లక్షల టన్నులను మాస్కో సరఫరా చేస్తుందన్నారు. ఆపై ఆ దేశ డీజిల్‌ రిఫైనరీల పరిస్థితులను బట్టి స్వల్ప కాలంలోనే మరో 30 లక్షల టన్నుల వరకూ అందిస్తుందని తెలిపారు. హార్ముజ్‌ జలసంధిపై తమకు పూర్తి నియంత్రణ ఉందని.. ఇరాన్‌కు అణ్వాయుధం దక్కనివ్వమంటూ ఈ సందర్భంగా ట్రంప్ స్పష్టంచేశారు.

ఈ ఒప్పందం ప్రకారం రష్యా నుండి తక్కువ ధరకే శుద్ధి చేసిన డీజిల్ అమెరికాకు సరఫరా కానుంది. దీనివల్ల రవాణా ఖర్చులు తగ్గి, నిత్యావసర వస్తువుల ధరలు కూడా అదుపులోకి వస్తాయని వైట్‌హౌస్ వర్గాలు ఆశిస్తున్నాయి.

భూరాజకీయ పరంగా ఈ నిర్ణయం తీవ్ర చర్చనీయాంశమైనప్పటికీ, అంతర్జాతీయ దౌత్య సమీకరణాల కంటే తమ దేశ ఆర్థిక ప్రయోజనాలు, ఓటర్ల సంతృప్తికే ట్రంప్ ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే.. రష్యా నుంచి డీజిల్ సరఫరా పెరిగితే ధరలు వేగంగా తగ్గుతాయని చెప్పలేమని.. నిపుణులు చెబుతున్నారు. సరఫరా పరిమాణం, ప్రపంచవ్యాప్త డిమాండ్, రవాణా పరిస్థితులు వంటి అంశాలపై ప్రభావం ఆధారపడి ఉంటుందంటున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండిా..

Follow Us
డీజిల్‌ ధరలు వేగంగా తగ్గుతాయ్.. రష్యాతో అమెరికా బిగ్ డీల్..
డీజిల్‌ ధరలు వేగంగా తగ్గుతాయ్.. రష్యాతో అమెరికా బిగ్ డీల్..
రాంచీలో సంజూ సునామీ.. సెంచరీ మిస్సవడంతో పాటు చెత్త రికార్డు నమోదు
రాంచీలో సంజూ సునామీ.. సెంచరీ మిస్సవడంతో పాటు చెత్త రికార్డు నమోదు
శని దేవుడి ఆశీస్సులతో ఈ రాశుల వారికి మహర్దశ.. ఊహించని మార్పులు!
శని దేవుడి ఆశీస్సులతో ఈ రాశుల వారికి మహర్దశ.. ఊహించని మార్పులు!
రోజూ ఉదయాన్నే వేప నీటితో ముఖం కడిగితే ఏమవుతుందో తెలుసా?
రోజూ ఉదయాన్నే వేప నీటితో ముఖం కడిగితే ఏమవుతుందో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో వెదర్ అప్డేట్..
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో వెదర్ అప్డేట్..
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
ఓటీటీలో ఒళ్లుగగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
ఓటీటీలో ఒళ్లుగగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
దసరా ఎప్పుడు? అక్టోబర్ 20నా.. 21నా? విజయదశమి ముహూర్తం, రావణ దహనం
దసరా ఎప్పుడు? అక్టోబర్ 20నా.. 21నా? విజయదశమి ముహూర్తం, రావణ దహనం
ఇతరుల మాటలు గుడ్డిగా నమ్మితే జరిగేది ఇదే.. అమాయకపు బ్రాహ్మణుడు కథ
ఇతరుల మాటలు గుడ్డిగా నమ్మితే జరిగేది ఇదే.. అమాయకపు బ్రాహ్మణుడు కథ
అక్టోబర్ 10 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
అక్టోబర్ 10 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్..