Guinness World Record: గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన కుక్క.. ప్రత్యేకత ఏంటో తెలిస్తే నోరెళ్ల బెడతారు..

|

Mar 06, 2023 | 3:02 PM

కుక్కల్లో కూడా అనేక జాతులు ఉన్నాయి. జాతులను బట్టి వాటి ఆకారాలు కూడా వేరుగా ఉంటాయి. అయితే, బిస్బి అనే కుక్క గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించింది.

Guinness World Record: గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన కుక్క.. ప్రత్యేకత ఏంటో తెలిస్తే నోరెళ్ల బెడతారు..
Dog World Record
Follow us on

అత్యంత విశ్వాసం కలిగిన జంతువుగా కుక్కను పరిగణిస్తారు. మనిషికి మొదటి మిత్రుడిగా కూడా చెప్పుకుంటారు. యజమానుల పట్ల అత్యంత విశ్వాసంతో ఉండే కుక్కలు..ఒక్కసారి అలవాటు పడ్డాయంటే జీవితాంతం వారిని విడిచిపెట్టి ఉండలేవు. అందుకే చాలామంది ప్రజలు తమకు తోడుగా ఉంటుందని కుక్కలను పెంచుకుంటుంటారు. అయితే కుక్కల్లో కూడా అనేక జాతులు ఉన్నాయి. జాతులను బట్టి వాటి ఆకారాలు కూడా వేరుగా ఉంటాయి. అయితే, అసలు విషయానికొస్తే పెంపుడు కుక్కల్లో అతిపెద్ద నాలుక కలిగిన కుక్కగా అమెరికాకు చెందిన బిస్బి అనే కుక్క గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించింది. మూడేళ్ల వయసున్న బిస్బి నాలుక 3.74 అంగుళాల పొడవుతో ప్రపంచంలోనే అతి పొడవైన నాలుక కలిగిన కుక్కగా నిలిచిందంటూ గిన్నిస్ బుక్ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు ఈ కుక్క వీడియో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ట్విటర్ ఖాతాలో అధికారికంగా షేర్ చేశారు.

అమెరికాలోని టక్సన్‌ నగరానికి చెందిన ఓ కుక్క అత్యంత పొడవైన నాలుక కలిగి ఉండటంతో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డును సొంతం చేసుకుంది. బిస్బీ అనే మూడు సంవత్సరాల కుక్క 3.74 అంగుళాల నాలుకను కలిగి ఉంది. మూతి కొన నుండి కుక్క నాలుకను కొలవటం ద్వారా ప్రపంచ రికార్డు క్రియేట్‌ చేసినట్టుగా వెల్లడించారు.. మొదట కుక్క నాలుకను వీలైనంత వరకు మూతి నుండి బయటకు తీసిన. అప్పుడు కొలిచారు పశువైద్యులు. ఇది పొడవైన నాలుక కలిగిన కుక్కగా ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

ఇవి కూడా చదవండి

కుక్క యజమానులు, జే, ఎరికా జాన్సన్.. వారు కుక్కపిల్లని దత్తత తీసుకున్నప్పుడు కొంచెం భిన్నమైన విషయాన్ని గమనించారు. కొన్ని రోజుల తర్వాత, కుక్క నాలుక మరింత పొడవుగా పెరిగిపోవటం గమనించారు. విషయం అతని స్నేహితులకు చెప్పారు. దానిని ఫోటో తీసి పంపగా, వారిలో కొందరు కుక్క నాలుక ప్రపంచ రికార్డు కావచ్చని పేర్కొన్నారు. దాంతో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ వారికి కూడా ఫోటోలను షేర్‌ చేయగా, వారు కుక్క నాలుకను పరిశీలించారు. బిస్బీ నాలుక పాప్సికల్ స్టిక్ కంటే పొడవుగా ఉందని చెప్పారు.అలా బిస్బీ డాగ్ వరల్డ్ రికార్డ్ సాధించిందని యజమాని తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి :