Wild Deer in US: చైనాలోని వుహాన్ నగరంలో రెండేళ్ల క్రితం వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్.. ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తూనే ఉంది. రోజుకో రూపాన్ని సంతరించుకుంటూ.. మానవాళిపై విరుచుకుపడుతుంది. ఆర్ధికంగా, శారీరకంగా అనేక ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్న ఈ కోవిడ్ మహమ్మారి ఇప్పుడు జంతువులపైనా తన ప్రతాపం చూపుతోంది. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ మళ్లీ విరుచుకుపడుతున్న వేళ ఈసారి మరింత ఆందోళన కలిగించే విషయం వెలుగుచూసింది. వివరాలోకి వెళ్తే..
ఒహాయోలో తెల్లతోక జింకలకు కరోనా వైరస్ సంక్రమించినట్టు పరిశోధనల్లో తేలింది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉండే తెల్ల తోక జింకల నమూనాలను పరిశీలించగా మొత్తం 129 జింకలకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. మూడు రకాల ఇన్ఫెక్షన్‌లను US శాస్త్రవేత్తలు గుర్తించారు. మనుషుల ద్వారానే వైరస్ వాటికి సంక్రమించి ఉంటుందని ఒహియో స్టేట్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు భావిస్తున్నారు. ఈ సంవత్సరంలో జనవరి-మార్చి మధ్య ఒహాయోలోని తొమ్మిది ప్రాంతాల్లో 360 తెల్లతోక జింకల నుంచి నమూనాలు సేకరించారు. వీటిని పరీక్షించినప్పుడు 129 జింకలకు వైరస్ సంక్రమించినట్టు నిర్ధారణ అయింది. అంతేకాదు, అడవి జింకలు సార్స్ కోవ్-2 వైరస్‌కు రిజర్వాయర్లుగా మారే అవకాశం ఉందని ఒహాయో స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read:
ఆ దేశంలో విడాకుల కోసం కోర్టుకు.. 8వేల సంవత్సరాల వరకూ దేశం విడిచి వెళ్లవద్దని కోర్టు తీర్పు..