Bangladesh: ఢాకాలో దుర్గా మాత ఆలయం కూల్చివేత..భక్తుల ఆగ్రహం.. భారత్ నుంచి తీవ్ర స్పందన..

బంగ్లాదేశ్ ప్రభుత్వం ఢాకాలోని హిందూ మైనారిటీ దుర్గా ఆలయ కూల్చివేతను బహిరంగంగా సమర్థించింది. యూనస్ తాత్కాలిక ప్రభుత్వం హింసాత్మకంగా అధికారంలోకి వచ్చినప్పటి నుండి మైనారిటీలు దారుణాలు, మానవ హక్కుల ఉల్లంఘనలను ఎదుర్కొంటున్నారంటూ అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. ఆలయం చట్టవిరుద్ధమని బంగ్లా అధికారులు పేర్కొనగా,

Bangladesh: ఢాకాలో దుర్గా మాత ఆలయం కూల్చివేత..భక్తుల ఆగ్రహం..  భారత్ నుంచి తీవ్ర స్పందన..
Demolition of durga mata temple

Updated on: Jun 28, 2025 | 6:59 AM

బంగ్లాదేశ్‌లో మైనారిటీలు ముఖ్యంగా హిందువుల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. తాజాగా, ఢాకాలోని ఖిల్ఖేత్‌లో దుర్గామాత ఆలయాన్ని కూల్చివేయడం తీవ్ర దుమారం రేపుతోంది. ఆలయ కూల్చివేతను సమర్థిస్తూ బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఢాకాలో దుర్గా ఆలయ కూల్చివేతను సమర్థించింది. ఆ ఆలయం రైల్వే భూమిలో ఉందని, కొత్త రైల్వే లైన్ కోసం దానిని తొలగించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి అక్రమ నిర్మాణాలను తొలగించడం ఒక సాధారణ, చట్టబద్ధమైన పరిపాలనా ప్రక్రియ అని బంగ్లాదేశ్ ప్రభుత్వం తెలిపింది.

అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రక్రియలో, మండప విగ్రహాన్ని స్థానిక హిందూ సమాజ సభ్యుల ఆధ్వర్యంలో సమీపంలోని బాలు నదిలో భక్తితో నిమజ్జనం చేశారు. మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఢాకాలోని హిందూ మైనారిటీ దుర్గా ఆలయ కూల్చివేతను బహిరంగంగా సమర్థించింది. యూనస్ తాత్కాలిక ప్రభుత్వం హింసాత్మకంగా అధికారంలోకి వచ్చినప్పటి నుండి మైనారిటీలు దారుణాలు, మానవ హక్కుల ఉల్లంఘనలను ఎదుర్కొంటున్నారంటూ అక్కడి ప్రజలు ఆరోపిస్తు్న్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

కాగా, ఈ ఘటనపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. ఆలయం చట్టవిరుద్ధమని బంగ్లా అధికారులు పేర్కొనగా, అది అరాచక చర్య అని, మతపరమైన ఆస్తులకు రక్షణ కల్పించడం బంగ్లాదేశ్ ప్రభుత్వ బాధ్యత అని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వ్యాఖ్యానించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..