Delta Variant: డెల్టా వేరియంట్ ప్రమాదకరమే.. పేద దేశాలకు వ్యాక్సిన్ అందించాలి: డబ్ల్యూహెచ్ఓ

|

Jun 26, 2021 | 3:45 PM

WHO - Delta Variant: కరోనా సమసిపోకముందే.. దాని వేరియంట్లు ప్రపంచవ్యాప్తంగా అలజడి సృష్టిస్తున్నాయి. ఇటీవల డెల్టా వేరియంట్ కేసులు చాలా దేశాల్లో పెరుగుతున్నాయి. ఇప్పటికే 85 దేశాల్లో

Delta Variant: డెల్టా వేరియంట్ ప్రమాదకరమే.. పేద దేశాలకు వ్యాక్సిన్ అందించాలి: డబ్ల్యూహెచ్ఓ
Tedros Adhanom
Follow us on

WHO – Delta Variant: కరోనా సమసిపోకముందే.. దాని వేరియంట్లు ప్రపంచవ్యాప్తంగా అలజడి సృష్టిస్తున్నాయి. ఇటీవల డెల్టా వేరియంట్ కేసులు చాలా దేశాల్లో పెరుగుతున్నాయి. ఇప్పటికే 85 దేశాల్లో డెల్టా వేరియంట్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీనిగురించి అప్రమత్తంగా ఉండాలని ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ.. హెచ్చరించింది. ఇది కూడా వ్యాప్తి చేసే వేరియంటేనని.. తీవ్రంగా వ్యాపించే అవకాశముందని డబ్ల్యూహెఓ చీఫ్ టెడ్రోస్ అథనమ్ గెబ్రియేసెస్ తెలిపారు. దీని నివారణకు టీకాలే ఆయుధాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన జెనీవాలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. డెల్టా వేరియంట్ విజృంభించక ముందే.. పేద దేశాల‌కు క‌రోనా వ్యాక్సిన్లు అందేలా చేయాల‌ని.. టీకా ఉత్ప‌త్తి చేస్తోన్న దేశాల‌ను కోరారు. ధ‌నిక దేశాల్లో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ స‌జావుగానే కొన‌సాగుతోంద‌ని పేద దేశాల‌కు మాత్రం అంద‌డం లేద‌ంటూ ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.

క‌రోనాతో ముప్పు లేని యువ‌త‌కు కూడా ధ‌నిక దేశాలు వ్యాక్సిన్లు అందిస్తుండ‌గా పేద దేశాల్లో రిస్క్ ఉన్న వారికి కూడా అంద‌డం లేదని పేర్కొన్నారు. అయితే.. ఆఫ్రికాలో ఈ ప‌రిస్థితి దారుణంగా ఉంద‌న్నారు. వారం రోజుల క్రితం ఉన్న ప‌రిస్థితుల‌తో పోల్చి చూస్తే ప్ర‌స్తుతం ఇన్‌ఫెక్ష‌న్లు, మ‌ర‌ణాలు 40 శాతం పెరిగాయ‌ని గెబ్రియేసెస్ ఆందోళన వ్యక్తంచేశారు. డెల్టా వేరియంట్ వైర‌స్ ప్ర‌పంచ వ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతోంద‌ని.. ఈ తరుణంలో ప్ర‌పంచ దేశాల‌కు వ్యాక్సినేష‌న్ అందించ‌డంలో విఫ‌ల‌మ‌వుతున్నామ‌న్నారు. వ్యాక్సిన్ల స‌ర‌ఫ‌రా స‌మ‌స్య‌గా మారింద‌ని.. ముందు ఆఫ్రికా దేశాల‌కు వ్యాక్సిన్లు పంపాల‌ని ఆయ‌న వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తున్న దేశాలను కోరారు.

కాగా, ప్ర‌పంచ దేశాల‌కు వ్యాక్సిన్లు అందించాల‌న్న ఉద్దేశంతో డబ్ల్యూహెచ్‌వో ప్రారంభించిన కోవాక్స్ కార్య‌క్ర‌మానికి కూడా టీకాల స‌ర‌ఫ‌రాలో జాప్యం జ‌రుగుతోంది. ఆస్ట్రాజెనికా, సీరం, జాన్స‌న్ అండ్ జాన్స‌న్ సంస్థ‌ల నుంచి ఈ నెల‌లో ఒక్క డోసు కూడా అంద‌లేద‌ని డ‌బ్ల్యూహెచ్‌వో పేర్కొంది.

Also Read:

Delta Variant: కరోనా నియంత్రణలో ముందున్న దేశాల్లో కొత్త గుబులు.. డెల్టా వేరియంట్‌తో అస్ట్రేలియా, ఇజ్రాయెల్, ఆఫ్రికా దేశాల అలర్ట్!

ఏలియన్స్‌ ఉంటే కచ్చితంగా మనల్ని చూస్తూనే ఉంటారు!లీసా కాల్టేనెగర్‌ వివరణ :Aliens.