Afghanistan Crisis: కాబుల్ విమానాశ్రయంలో పెలుళ్లు.. 110 కి చేరిన మృతుల సంఖ్య..

|

Aug 27, 2021 | 4:43 PM

Afghanistan Crisis: తాలిబన్ల నియంత్రణలో వెళ్లిన అప్గానిస్తాన్‌ దేశం రావణకాష్టంలా రగులుతోంది. ఆఫ్గాన్ రాజధాని కాబూల్ ఆత్మాహుతి దాడులతో దద్దరిల్లిన విషయం తెలిసిందే.

Afghanistan Crisis: కాబుల్ విమానాశ్రయంలో పెలుళ్లు.. 110 కి చేరిన మృతుల సంఖ్య..
Afghanistan
Follow us on

Afghanistan Crisis: తాలిబన్ల నియంత్రణలో వెళ్లిన అప్గానిస్తాన్‌ దేశం రావణకాష్టంలా రగులుతోంది. ఆఫ్గాన్ రాజధాని కాబూల్ ఆత్మాహుతి దాడులతో దద్దరిల్లిన విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం కాబుల్ విమానాశ్రయం వెలుపల వరుసగా సంభవించిన జంట పేలుళ్లలో మృతి చెందిన వారి సంఖ్య 110 చేరింది. ఇదే విషయాన్ని ఆఫ్గన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఉర్దూపాయింట్ న్యూస్/స్పుత్నిక్ కు ఆఫ్గన్ అధికారిక వర్గాలు మరణాల సంఖ్యను తెలియజేశాయి. కాగా, పెళుళ్లు జరిగిన రోజు అంటే గురువారం నాడు దాదాపు 1,330 మందికిపైగా గాయపడ్డారని అధికారికంగా ప్రకటించింది. వీరిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఇక అమెరికాకు చెందిన 13 మంది సైనికులు కూడా ఈ మరణాల జాబితాలో ఉన్నట్లు తెలిపారు.

కాగా, పేలుళ్లు జరిగిన రోజున(గురువారం) సుమారు 72 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 12 మంది అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోగా.. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పెంటగాన్ స్పష్టం చేసింది. మొత్తంగా ఈ పేలుళ్లలో 143 మందికి తీవ్ర గాయాలైనట్లు ఆఫ్గన్, అమెరికా అధికారులు స్పష్టం చేశారు. మృతుల సంఖ్య మరింతగా పెరగవచ్చునని భావిస్తున్నారు.

గురువారం నాడు కాబూల్ విమానాశ్రయం వెలుపల అబ్బే గేట్ వద్ద ఒక పేలుడు సంభవించగా.. కాసేపటికే అక్కడికి సమీపంలో ఉన్న బేరన్ హోటల్ వద్ద మరో పేలుడు సంభవించింది. ఆ తరువాత మరో మూడు పెలుళ్లు సంభవించాయి. వీటిలో రెండు చోట్ల ఆత్మహుతి దాడులు జరిగాయని అమెరికా రక్షణ శాఖ కార్యాలయ ప్రతినిథి జాన్ కిర్బి వెల్లడించారు. అయితే, కాబుల్‌ ఎయిర్‌పోర్టు వద్ద ఉగ్రదాడి జరిగే ప్రమాదం ఉందని అమెరికా సహా నాటో దేశాలు హెచ్చరించిన గంటల వ్యవధిలోనే పేలుడు సంభవించడం కలకలం సృష్టిస్తోంది.

Also read:

Viral Video: ఈ చిన్నారి ఇస్తున్న మెసేజ్‏కు నెటిజన్లు ఫిదా.. సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న ప్రశంసలు..

Hima Kohli: న్యాయమూర్తి హిమా కోహ్లీకి ఘనంగా వీడ్కోలు లైవ్ వీడియో

Tea Side Effects: మీకు ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో టీ తాగే అలవాటు ఉందా..? అయితే జాగ్రత్త..!