Covishield Excluded EU: ఈయూ సభ్యదేశాల కీలక నిర్ణయం.. గ్రీన్ పాస్ అర్హత జాబితా నుంచి కొవిషీల్డ్ తొలగింపు

|

Jun 28, 2021 | 9:42 PM

తమ దేశానికి విదేశాల నుంచి వచ్చే వాళ్లు ఏ వ్యాక్సిన్ తీసుకుంటే అనుమతిస్తారో వివరిస్తూ యూరోపియన్ యూనియన్ ఇక జాబితా విడుదల చేసింది.

Covishield Excluded EU: ఈయూ సభ్యదేశాల కీలక నిర్ణయం.. గ్రీన్ పాస్ అర్హత జాబితా నుంచి కొవిషీల్డ్ తొలగింపు
Covishield Excluded From New Eu Covid 'green Pass'
Follow us on

Covishield Excluded EU Covid ‘Green Pass’: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నుంచి విముక్తికి వ్యాక్సిన్ దోహదపడుతుందన్న నిపుణులు సూచనల మేరకు టీకా పంపిణీ వేగవంతం కొనసాగుతోంది. ముఖ్యంగా కరోనా కష్టకాలంలో ఇతర దేశాల ప్రయాణికులను తమ దేశంలోకి అనుమతించేందుకు చాలా దేశాలు వ్యాక్సిన్ తప్పనిసరి చేశాయి. ఈ నేపథ్యంలోనే తమ దేశానికి విదేశాల నుంచి వచ్చే వాళ్లు ఏ వ్యాక్సిన్ తీసుకుంటే అనుమతిస్తారో వివరిస్తూ యూరోపియన్ యూనియన్ ఇక జాబితా విడుదల చేసింది. దీనినే ‘గ్రీన్ పాస్’ ఎలిజిబిలిటీ జాబితాగా పిలుస్తున్నారు.

నిన్న మొన్నటి వరకూ భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులు కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నా వారికి గ్రీన్ పాస్ మంజూరు చేసిన బ్రిటన్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. గ్రీన్ పాస్ జాబితా నుంచి కొవిషీల్డ్‌ను తొలగిస్తున్నట్లు ఈయూ సమాఖ్య తెలిపింది. దీంతో ఐరోపా దేశాలకు వెళ్లాలని అనుకునే భారతీయులకు చిక్కులు వచ్చినట్లు అయింది. దీనిపై సీరమ్ ఇన్‌స్టిట్యూట్ సీఈవో ఆదార్ పూనావాలా కూడా స్పందించారు. ‘‘ఈ సమస్యను అత్యున్నత స్థాయి వర్గం దృష్టికి తీసుకెళ్లా. త్వరలోనే దీనికి పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నా’’ అని ట్వీట్ చేశారు.


ఈయూలో సభ్య దేశాలు తమ దేశంలోకి వచ్చేవారికి డిజిటల్ “వ్యాక్సిన్ పాస్‌పోర్ట్” ను ఇవ్వడం ప్రారంభించాయి. ఇవి యూరోప్‌లో ఉద్యోగరీత్య వచ్చేవారు, పర్యాటకుల కోసం స్వేచ్ఛగా వెళ్లడానికి వీలు కల్పిస్తాయి. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తిగానీ, రోగరోధక శక్తి కలిగిన వ్యక్తులు గానీ, కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న వ్యక్తులకు మాత్రమే వ్యాక్సిన్ పాస్‌పార్ట్ అంటే గ్రీన్ పాస్ ను అందుబాటులోకి తీసుకువచ్చాయి ఈయూ సభ్య దేశాలు. కోవిడ్ -19 వ్యాక్సిన్ రకంతో సంబంధం లేకుండా సభ్య దేశాలు ధృవీకరణ పత్రాలను జారీ చేయాలని యూరోపియన్ యూనియన్ నిర్ణయించింది.

అయితే, తాజా నిర్ణయంతో నాలుగు టీకాలను యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ (EMA) ఆమోదించింది. వీటిని EU సభ్య దేశాలలో ఉపయోగించవచ్చు. ఫైజర్ , బయోఎంటెక్, మోడెర్నా, ఆస్ట్రాజెనెకా, జాన్సెన్ వ్యాక్సిన్లు వేసుకున్నవారిని మాత్రమే అనుమతించాలని ఈయూ నిర్ణయించింది. దీంతో కొవిషీల్డ్ తీసుకున్న వారికి ఇక అనుమతి ఉండకపోవచ్చని తెలుస్తోంది.

Read Also…  Corona Fake Vaccine: నకిలీ టీకాలు వస్తున్నాయి జాగ్రత్త.. వ్యాక్సిన్ అసలు..నకిలీ ఎలా తెలుసుకోవాలి? ఇక్కడ తెలుసుకోండి