Corona Virus: కరోనాను జయించిన మొదటి దేశం ఇదే … మాస్కులు వేసుకోనక్కర్లేదని అధికారికంగా ప్రకటన

| Edited By: Team Veegam

Apr 22, 2021 | 11:38 AM

Corona Virus: ప్రస్తుతం ప్రపంచంలో కరోనా రకరకాల వేరియెంట్స్ వెలుగులోకి వస్తున్నాయి. దీంతో మాస్క్ లు లేకుండా బయటకు రావద్దని ప్రతి ఒక్క దేశం..

Corona Virus: కరోనాను జయించిన మొదటి దేశం ఇదే ... మాస్కులు వేసుకోనక్కర్లేదని అధికారికంగా ప్రకటన
Mask Free Country
Follow us on

Corona Virus:చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాల్లో కల్లోలం సృష్టిస్తోంది.2019 డిసెంబర్ లో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్ ఇప్పటికీ తగ్గుముఖం పట్టడం లేదు.. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడ్డారు.. కొన్ని లక్షల మంది ఈ వైరస్ తో మృతి చెందారు. అయితే కరోనా వైరస్ రకరకాల రూపాలను సంతరించుకుంటుందని దాదాపు 2022 వరకూ ఈ కల్లోలం కొనసాగుతుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. అంతేకాదు.. ఈ వైరస్ నివారణ కోసం పలు సూచనలను చేసింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మాస్కులు వేసుకోవడం వల్ల కరోనా రాకుండా జాగ్రత్త పడవచ్చు అని చెప్పింది.

ప్రస్తుతం ప్రపంచంలో కరోనా రకరకాల వేరియెంట్స్ వెలుగులోకి వస్తున్నాయి. దీంతో మాస్క్ లు లేకుండా బయటకు రావద్దని ప్రతి ఒక్క దేశం తమ పౌరులకు సూచిస్తుంది. అమెరికా అయితే స్పెషల్ మాస్క్ తయారు చేసేవారికి ప్రత్యేక బహుమతిని కూడా ప్రకటించింది. రోజువారీ జీవితంలో మాస్కులు తప్పని సరి అయ్యాయి. అయితే ఒక్క దేశంలో మాత్రం కరోనా లేదు.. మాస్కులు ఇక ధరించాల్సిన అవసరం లేదు.. జాగ్రత్తలు తీసుకోండి అని అధికారికంగా ప్రకటించింది. మరి మాస్క్ నుంచి విముక్తి పొందిన ఆ దేశం వివరాల్లోకి వెళ్తే..

ఇజ్రాయిల్ లో మాస్కులు ధరించక్కర్లేదని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇలా చెప్పిన మొట్టమొదటి దేశంగా వార్తల్లో నిలిచింది. అవును అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్ ప్రజలు ఇక నుంచి మాస్కు ధరించి వద్దని చెప్పారు. 81% అక్కడ ప్రజలు వ్యాక్సిన్ ని వేయించుకున్నారు. ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిన తర్వాత జనం మాస్కులు వేసుకోవడం మానేశారు.

దీంతో అక్కడ ప్రజలు తమ ఆనందాన్ని సోషల్ మీడియా .ద్వారా పంచుకున్నారు. 81 శాతం అక్కడ ఉండే ప్రజలు రెండు కరోనా వ్యాక్సిన్ లు కూడా వేసుకున్నారు. ఇక ఇజ్రాయిల్ కు ఇటీవల వస్తున్న విదేశీయులు కూడా చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు.

తాజాగా అక్కడ దేశం మొత్తం మీద ఏడు కేసులు నమోదయ్యాయని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ప్రకటించింది. అంతేకాదు కరోనా ఇంకా తమ దేశం నుంచి వెళ్ళిపోలేదని ఆ దేశ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు అన్నారు. మరోసారి కరోనా వచ్చే అవకాశం కూడా ఉందని.. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అయితే ఆ దేశ జనాభా కోటి కంటే తక్కువే. ఇప్పటివరకు ఎనిమిది లక్షల కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ కారణంగా ఆరు వేల మంది మరణించారు. ఈ వైరస్ ను చైనా కావాలనే పుట్టించిందని మొదటి నుంచి ఇజ్రాయిల్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే..

Also Read: ప్లాస్మా అంటే ఏమిటి.. కరోనా పేషేంట్స్ చికిత్స కు ఎందుకు ఉపయోగిస్తారంటే..

SBI కస్టమర్లకు శుభవార్త… ఆ అకౌంట్ ఉంటే రూ. 2 లక్షలు మీ సొంతం.. అది ఎలానో తెలుసా..

పిడుగులాంటి వార్త, ఆంధ్రప్రదేశ్ లో వివిధ పెన్షన్ల లబ్దిదారులపై సర్కారు నజర్, కొత్త రూల్స్ తో కోత. !

Coronavirus Symptoms: మీకు ఈ విధంగా దగ్గు వస్తుందా..? అయితే కరోనా లక్షణాలే కావొచ్చు.. ఎందుకంటే..?