Coronavirus Cases World: ప్రపంచ కరోనా అప్‌డేట్.. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు, మరణాలు ఎన్నంటే.!

|

Feb 03, 2021 | 8:39 PM

Coronavirus Cases World: కరోనా వైరస్ మొత్తం ప్రపంచ దేశాలన్నింటిని చుట్టేసింది. ఏడాది గడుస్తున్నా కూడా.. ప్రతీ రోజూ నమోదయ్యే పాజిటివ్ కేసులు..

Coronavirus Cases World: ప్రపంచ కరోనా అప్‌డేట్.. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు, మరణాలు ఎన్నంటే.!
Follow us on

Coronavirus Cases World: కరోనా వైరస్ మొత్తం ప్రపంచ దేశాలన్నింటిని చుట్టేసింది. ఏడాది గడుస్తున్నా కూడా.. ప్రతీ రోజూ నమోదయ్యే పాజిటివ్ కేసులు, మరణాలకు మాత్రం బ్రేక్ పడట్లేదు. ఇదిలా ఉంటే మరోవైపు యూకేలో పుట్టిన కొత్తరకం వైరస్ ప్రజలను మరింత భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఇది కరోనా కన్నా 70 శాతం వేగంగా వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు ప్రకటించడంతో దేశాలన్నీ కూడా మరోసారి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాయి. ఇక తాజాగా ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 104,508,452కి చేరింది. గడిచిన 24 గంటల్లో 4,56,774 పాజిటివ్ కేసులు.. 14,714 మరణాలు సంభవించాయి. అటు ఇప్పటిదాకా 2,265,401 మంది వైరస్ కారణంగా మరణించగా.. 76,383,317 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

ఇక అమెరికాలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. సెకండ్ వేవ్ కొనసాగుతుండటంతో ప్రతీ రోజూ భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 27,029,530కి చేరింది. అలాగే ఈ వైరస్ వల్ల ఇప్పటివరకూ అమెరికాలో 457,910 మంది మృతి చెందారు. ఇక బ్రెజిల్, రష్యా, ఫ్రాన్స్, స్పెయిన్, యూకేలలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా బ్రిటన్, ఆఫ్రికా దేశాల్లో కొత్తరకం ‘స్ట్రెయిన్’ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రపంచమంతా ఆందోళన కలిగిస్తోంది. ఇక ఇండియాలో ఇప్పటివరకు 10,784,563 పాజిటివ్ కేసుల కేసులు నమోదు కాగా.. 154,655 మంది వైరస్ కారణంగా మరణించారు.

Also Read:

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా దిగొచ్చిన బంగారం ధరలు.. వరుసగా రెండో రోజు ఎంతంటే.!

ప్రభాస్ ‘ఆదిపురుష్’ సెట్స్‌లో భారీ అగ్ని ప్రమాదం.. చిత్ర యూనిట్ తప్పిన పెను ముప్పు..

రోజుకో ట్విస్ట్ ఇస్తున్న మదనపల్లె మర్డర్ కేసు.. హత్యల తర్వాత కూడా వారి సోషల్ మీడియా ఖాతాలు యాక్టివ్‌లోనే.?