Corona Virus: కరోనాతో సహజీవనం చేయడం నేర్చుకున్నాం.. సాధారణ ప్లూగానే చూస్తాం..మాస్క్ సహా కరోనా నిబంధనలు ఎత్తివేసిన దేశం..

|

Jan 28, 2022 | 7:15 AM

Corona Virus: రెండేళ్ళ క్రితం ప్రపంచంలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్(Corona Virus)ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లో ఉన్న భయాందోళనలు...క్రమేపీ తగ్గుతున్నట్లు తాజా పరిస్థితుల వలన వెల్లడవుతుంది..

Corona Virus: కరోనాతో సహజీవనం చేయడం నేర్చుకున్నాం.. సాధారణ ప్లూగానే చూస్తాం..మాస్క్ సహా కరోనా నిబంధనలు ఎత్తివేసిన దేశం..
Uk Lift Covid Restrictions
Follow us on

Corona Virus: రెండేళ్ళ క్రితం ప్రపంచంలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్(Corona Virus)ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లో ఉన్న భయాందోళనలు…క్రమేపీ తగ్గుతున్నట్లు తాజా పరిస్థితుల వలన వెల్లడవుతుంది. ఇంకా చెప్పాలంటే కరోనాతో సహజీవనం చేయడం ప్రజలు నేర్చుకున్నారు. ఓ వైపు కొత్త కొత్త వేరియంట్స్ (New Variant).. మరోవైపు కరోనా నివారణ కోసం వ్యాక్సిన్లు (Corona Vaccine), బూస్టర్ డోసులను ఇస్తూనే ఉన్నారు. అనేక దేశాలు కోవిడ్ ను అదుపు చేయడం కోసం కఠిన కరోనా నిబంధనలు అమలు చేస్తూనే ఉంది.. అయితే తాజాగా ఇంగ్లాండ్ దేశం కరోనా నిబంధనల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. రోజుకి లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి.. అయినప్పటికీ అక్కడ ప్రభుత్వం కరోనా ఆంక్షలను తొలగించడానికే నిర్ణయం తీసుకుంది. మాస్కులు తప్పనిసరి సహా పలు కోవిడ్‌ ఆంక్షలను ఇంగ్లండ్‌ గురువారం ఎత్తేసింది. కోవిడ్‌ 19ను ఫ్లూలాగా పరిగణించి దీర్ఘకాలిక ప్రణాళిక తయారు చేతున్నట్లు ఆ దేశ వైద్య అధికారులు చెప్పారు. వివరాల్లోకి వెళ్తే..

ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని అరికట్టాలంటే.. బూస్టర్‌ డోస్‌ తప్పని సరి అని.. బ్రిటన్ లో వేగంగా బూస్టర్‌ డోస్‌ ను ఇస్తున్నారు. ఈ నేపద్యంలో కరోనా కేసులు నమోదవుతున్నా.. చికిత్స కోసం ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య గణనీయంగా తగ్గిందని బ్రిటన్‌ ప్రభుత్వం ప్రకటించింది. వెంటనే ఇంగ్లండ్‌ కరోనా నిబంధనలు సడలిస్తూ.. నిర్ణయం తీసుకుంది. దీంతో ఇక నుంచి ఇంగ్లండ్‌లో ప్రజలు తప్పని సరిగా మాస్కులు ధరించాల్సిన అవసరం లేదు. అంతేకాదు.. వేడుకలు, వేదికలు, పబ్ లు, నైట్‌ క్లబ్బులు ఇలా వేటినైనా స్వేచ్చగా జరుపుకోవచ్చు. వెళ్ళవచ్చు.. కోవిడ్‌ పాసల నిబంధనకు స్వస్తి చెప్పినట్లు ప్రకటించింది.అయితే తమ వినియోగదారులను ఫేస్‌ మాస్కులు ధరించమని కోరతామని కొన్ని దుకాణదారులు, రవాణా సంస్థలు ప్రకటించాయి. దీంతో ప్రభుత్వం చట్టపరమైన చర్యల నుంచి తప్పుకొంది. రాజధానిలోని బస్సులు, సబ్‌ వే రైళ్లలో ఇప్పటికీ మాస్కులు ధరించమని లండన్‌ మేయర్‌ సాధిక్‌ ఖాన్‌ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే ఇంటినుంచే పని, స్కూళ్లలో ఫేస్‌ మాస్కుల నిబంధనలను ప్రభుత్వం ఎత్తివేసిన సంగతి తెలిసిందే.

ఓమిక్రాన్‌ వ్యాప్తిని అడ్డుకోవడానికి.. బూస్టర్‌ డోస్‌ కార్యక్రమాన్ని డిసెంబర్‌ మొదటివారం నుంచే వేగవంతం చేసింది. అందరికీ బూస్టర్‌ డోసు ఇవ్వడంతో పాటు, కరోనా నిర్ధారణ పరీక్షలు, యాంటీ వైరల్‌ చికిత్సలను అందించడంలో యూరప్‌ బలంగా పనిచేసిందని యూరప్ ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యదర్శి సాజిద్‌ జావీద్‌ తెలిపారు. అంతేకాదు కరోనా వైరస్ పూర్తిగా అంతమయ్యే అవకాశం లేదని.. అందుకనే దానితో సహజీవనం చేయడం.. నేర్చుకున్నామని చెప్పారు. అంతేకాదు దేశంలో ఒమిక్రాన్‌ వ్యాప్తి పిల్లలు, వృద్ధుల్లో ఎక్కువగా ఉందన్నారు. 81 శాతం మంది బూస్టర్‌ డోసు తీసుకున్నారని తెలిపారు. అంతేకాదు 2022 ప్రారంభంలో రోజుకు రెండు లక్షల కేసులు నమోదు కాగా.. ఇప్పుడు కొత్త కేసుల నమోదు లక్షకు పడిపోయిందని చెప్పారు. గత 24 గంటల్లో యూకేలో 96,871 కొత్త కేసులు నమోదయ్యాయి. 338 మంది మరణించారు.

Also Read:

Viral Video: ఫ్లైట్‌లో దుమ్ములేపే డ్యాన్స్ చేసిన ఏయిర్ హోస్టెస్.. నెట్టింట వీడియో వైరల్