సిగరెట్ లేకుండా బర్త్‌డే చేసుకున్నా: అధ్యక్షుడిపై 116 ఏళ్ల వృద్ధుడు గరం

| Edited By:

May 09, 2020 | 7:46 PM

సిగరెట్ లేకుండా తన పుట్టినరోజు గడిచిపోవడం తనకు బాధాకరంగా ఉందని దక్షిణాఫ్రియాలోని అడలాయిడ్‌లోని 116 ఏళ్ల వృద్ధుడు తెగ ఫీల్ అవుతున్నారు.

సిగరెట్ లేకుండా బర్త్‌డే చేసుకున్నా: అధ్యక్షుడిపై 116 ఏళ్ల వృద్ధుడు గరం
Follow us on

సిగరెట్ లేకుండా తన పుట్టినరోజు గడిచిపోవడం తనకు బాధాకరంగా ఉందని దక్షిణాఫ్రియాలోని అడలాయిడ్‌లోని 116 ఏళ్ల వృద్ధుడు తెగ ఫీల్ అవుతున్నారు. 1904, మే 8న జన్మించిన ఫ్రెడ్లీ బ్లామ్ అనే వృద్ధుడు ఇటీవల 116వ పుట్టినరోజును జరుపుకున్నారు. అయితే కరోనా నేపథ్యంలో అక్కడ లాక్‌డౌన్ విధించడంతో పాటు సిగరెట్ అమ్మకాలపై నిషేదం విధించారు. దీంతో ఈ పుట్టినరోజు నాడు సిగరెట్లు అందుబాటులో లేకపోవడంతో బ్లామ్ వెలితిగా భావించారని ఆయన పొరుగింటి వ్యక్తి గైరోనెసా మైకేల్ తెలిపారు.

‘ఈ పుట్టిన రోజుకు సిగరెట్లు కావాలని కోరుకున్నా. కానీ మా దేశాధ్యక్షుడు సిరిల్ రమఫోసో అసలు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదంటూ’ ఏకంగా దేశాధ్యక్షుడిపైనే ఆయన గరం అయ్యారు. కాగా కేప్‌టౌన్‌లో వ్యవసాయం చేసుకొని బతికిన బ్లామ్‌ 106ఏళ్ల వరకు గార్డెనర్‌గా పనిచేస్తూ కట్టెలు కొట్టేవారట. ఆయన భార్య కూడా ఇప్పటికీ ఉన్నారు. ‘ప్రతి రోజు డిస్ప్రిన్ ట్యాబ్లెట్ వేసుకుంటానని, యూనో తాగుతానని, లాక్‌డౌన్‌ విధించే వరకు సిగరెట్లు కూడా తాగానని.. అంతకుమించిన ఆరోగ్య రహస్యం ఏమీ లేదని’ బ్లామ్ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. కాగా అతడి కన్నా నాలుగేళ్లు చిన్న వాడైన బ్రిటన్‌ నివాసి, 112 ఏళ్ల బాబ్‌ వెయిటన్‌ ప్రపంచ వద్ధుడిగా గిన్నీస్‌ బుక్‌లోకి ఎక్కగా.. బ్లామ్‌ గురించి ఎవరూ గిన్నీస్‌ బుక్‌ దృష్టికి తీసుకెళ్లక పోవడం వల్లనే ఆయన పేరు రికార్డుల్లోకి ఎక్కలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

Read This Story Also: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. త్వరలో బిగ్గెస్ట్ అనౌన్స్‌మెంట్‌..!