అమెరికా అధ్యక్ష భవనంలో తొలి కరోనా కేసు

| Edited By: Pardhasaradhi Peri

Mar 21, 2020 | 1:13 PM

అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో తొలి కరోనా కేసు నమోదయింది. ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ టీమ్ లోని ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ సోకినట్టు వెల్లడైంది.

అమెరికా అధ్యక్ష భవనంలో తొలి కరోనా కేసు
Follow us on

అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో తొలి కరోనా కేసు నమోదయింది. ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ టీమ్ లోని ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ సోకినట్టు వెల్లడైంది. అయితే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో గానీ, మైక్ పెన్స్ తో గానీ ఆ వ్యక్తి నేరుగా సన్నిహితంగా మెలిగిన దాఖలాలు లేవని పెన్స్ కార్యాలయ అధికారప్రతినిధి కేటీ మిల్లర్ తెలిపారు.  ట్రంప్ సూచనలపై….  మైక్ పెన్స్ కరోనా నివారణకుముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఆయన బృందంలోనే ఓ వ్యక్తికి ఈ వైరస్ పాజిటివ్ రావడం గమనార్హం. ఇటీవల స్వయంగా ట్రంప్ కరోనా పరీక్షలు చేయించుకోగా నెగెటివ్ అని తేలిన సంగతి తెలిసిందే. కాగా అమెరికాలో కరోనా సోకి మరణించినవారి సంఖ్య 230 మందికి పైగా పెరిగింది. న్యూయార్క్ నగరాన్ని అత్యంత ‘ప్రమాద నగరం’ గా ట్రంప్ ప్రకటించారు.