ఆ దేశంలో లీటర్ వంటనూనె రూ.605.. మూడు వారాల అవసరాలకే ఉన్న నిల్వలు

|

Jun 02, 2022 | 12:55 PM

దాయాది దేశం పాకిస్తాన్(Pakistan) లో నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. రోజురోజుకు పెరిగిపోతున్న ద్రవ్యోల్బణంతో ప్రజలు చుక్కలు చూస్తున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో పెరుగుతున్న ధరలకు కళ్లెం వేసే పరిస్థితి లేకపోగా...

ఆ దేశంలో లీటర్ వంటనూనె రూ.605.. మూడు వారాల అవసరాలకే ఉన్న నిల్వలు
Cooking Oil
Follow us on

దాయాది దేశం పాకిస్తాన్(Pakistan) లో నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. రోజురోజుకు పెరిగిపోతున్న ద్రవ్యోల్బణంతో ప్రజలు చుక్కలు చూస్తున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో పెరుగుతున్న ధరలకు కళ్లెం వేసే పరిస్థితి లేకపోగా.. ప్రజలపై మరింత భారం పడుతోంది. ఇప్పటికే పెట్రోల్ ధరలు పెంచిన పాక్ ప్రభుత్వం.. గతంలో ఎన్నడూ లేని విధంగా వంట నూనె(Cooking Oil Prices), నెయ్యి ధరలను విపరీతంగా పెంచేసింది. వరసగా రూ.213, రూ.208 పెంచి ప్రజల నడ్డి విరిచింది. ధరల పెరుగుదలతో లీటర్ నెయ్యి రూ.555, వంట నూనె రూ.605కు చేరాయి. పెరిగిన కొత్త ధరలు జూన్ 1 నుంచే అమలులోకి వచ్చాయి. వంట నూనెల రిటైల్​ధరలు త్వరలోనే యూఎస్సీ స్థాయికి చేరుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. పామ్​ఆయిల్ సరఫరాపై ఏర్పాటైన ప్రధాని టాస్క్​ఫోర్స్​కమిటీ ఇటీవలే ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. దేశంలో పామ్​ఆయిల్ డిమాండ్, సరఫరాలపై విశ్లేషించి ధరల తగ్గింపునకు చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

అయితే దేశ అవసరాలకు సరిపడా వంట నూనె లభించకపోవడంతో పాకిస్తాన్ విదేశీ దిగుమతులపై ఆధారపడుతోంది. ప్రస్తుతం కరాచీలో ఉన్న నిల్వలు మూడు వారాలకు సరిపోతాయి. ఆ తరువాత పరిస్థితి ఏంటనే విషయంపై సందిగ్ధత నెలకొంది. అంతే కాకుండా దేశంలో గోధుమ పిండి ధర కిలోకు రూ.65కు చేరింది. రష్యా-ఉక్రెయిన్​ యుద్ధం కారణంగా గ్యాస్, ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అయితే ఈ ధరల పెరుగుదల యుద్ధానికి ముందు నుంచే ఉండటం గమనార్హం.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..