త్వరలో ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది. ఇది దాదాపు 50 వేల ఏళ్ల క్రితం కనిపించిన అరుదైన దృశ్యం మళ్ళీ అంబరంలో దర్శనం ఇవ్వనుంది. తోకచుక్కలు గురించి మనకందరికీ తెలుసు. తోకచుక్కలు నిజంగా చుక్కలు కావు. తోకచుక్కలు సౌరకుటుంబానికి చెందినవి. సంస్కృతంలో తోకచుక్కలను ధూమకేతువులంటారు. పూర్వకాలంలో తోకచుక్క కనిపిస్తే ఏదో అరిష్టానికి సూచనగా భావించేవారు. ఇప్పటికి ఇంచుమించు 600 తోకచుక్కలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వీటిలో 513 చాలా దీర్ఘకాలికమైనవి. కొంతకాలం క్రితం వరకూ తోకచుక్క కనిపిస్తే ఏదో అరిష్టం జరగబోతుందని భావించేవారు. ఇదిలా ఉంటే త్వరలో ఎప్పుడో 50 వేల ఏళ్ల క్రితం కన్పించిన ఓ తోకచుక్క త్వరలో మళ్లీ మనల్ని పలకరించనుంది.
ఫిబ్రవరి 1న భూమికి అత్యంత సమీపంగా, అంటే 2.6 కోట్ల మైళ్ల దూరం నుంచి పయనించనుంది. జనవరి 26 నుంచి వారంరోజులపాటు కన్పిస్తుందని నాసా చెబుతోంది. అది ప్రస్తుతం మనకు 11.7 కోట్ల మైళ్ల దూరంలో ఉందని వెళ్లడించింది.
Comet 2022 E3 ZTF: https://t.co/56MTuNaP1U
— Astronomy Picture Of The Day (@apod) December 24, 2022
సి2022 E3గా పిలుస్తున్న ఈ తోకచుక్కను నాసా సైంటిస్టులు కెమెరాలో బంధించారు. కాగా భూమి మాదిరిగానే ఇది కూడా సూర్యుని చుట్టూ తిరుగుతుందట. 50 వేల ఏళ్లకు ఒక పరిభ్రమణం పూర్తి చేస్తుందట. 2020 జూలైలోనూ ఇలాగే ఒక తోకచుక్క మనకు కన్పించేంత సమీపంగా వచ్చిందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..