China: డ్రాగన్ కంట్రీ మీద ప్రకృతి పగబట్టిందా..! బొగ్గు గనిలో పెను ప్రమాదం, 12 మంది మృతి

|

Dec 22, 2023 | 10:35 AM

భూకంపం సృష్టించిన విధ్వంసం నుంచి చైనా ప్రజలు తేరుకోకముందే.. ఇప్పుడు బొగ్గు గనిలో చోటు చేసుకున్న ప్రమాదం అనేక మంది ప్రాణాలను బలిగొంది. బొగ్గు గనిలో సంభవించిన ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. సుమారు 13 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన చైనాలోని హీలాంగ్‌జియాంగ్‌ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి చేర్పించారు. 

China: డ్రాగన్ కంట్రీ మీద ప్రకృతి పగబట్టిందా..! బొగ్గు గనిలో పెను ప్రమాదం, 12 మంది మృతి
Colliery Accident In Jixi
Follow us on

చైనాలోని హీలాంగ్‌జియాంగ్ ప్రావిన్స్‌లోని బొగ్గు గనిలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా, 13 మంది గాయపడ్డారు. చైనా మీడియా నివేదికల సమాచారం ప్రకారం గాయపడిన వారిని చికిత్స కోసం వివిధ ఆసుపత్రులలో చేర్చారు. ఆ దేశ ప్రభుత్వం ప్రమాద కారణాలపై విచారణకు కమిటీని కూడా ఏర్పాటు చేసింది.

నివేదిక ప్రకారం హెంగ్షాన్ జిల్లాలోని కున్యువాన్ బొగ్గు గనిలో ఈ ప్రమాదం జరిగింది. అయితే చైనా గనుల్లో  ప్రమాదాలు జరగడం సర్వసాధారణం. అయినప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. చైనా అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి దారు దేశం మాత్రమే కాదు.. అతి పెద్ద వినియోగదార దేశం కూడా..

12 మంది చనిపోయారు

భూకంపం సృష్టించిన విధ్వంసం నుంచి చైనా ప్రజలు తేరుకోకముందే.. ఇప్పుడు బొగ్గు గనిలో చోటు చేసుకున్న ప్రమాదం అనేక మంది ప్రాణాలను బలిగొంది. బొగ్గు గనిలో సంభవించిన ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. సుమారు 13 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన చైనాలోని హీలాంగ్‌జియాంగ్‌ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి చేర్పించారు.

ఇవి కూడా చదవండి

భూకంపంలో 134 మంది మృతి

ప్రస్తుతం చైనా దేశాన్ని తరచుగా ప్రకృతి వైపరీత్యాలతో చుట్టుముడుతోంది. మొదట కరోనా మహమ్మారి, ఆ తర్వాత కరువు, వరదలు, ఆపై భూకంపం వేల మంది ప్రాణాలను బలిగొన్నాయి. ఇప్పుడు వివిధ ప్రమాదాలు ప్రజల మరణాలకు కూడా కారణం అవుతున్నాయి. ఇటీవల సంభవించిన భూకంపంలో కనీసం 134 మంది మృతి చెందారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..