Viral Video: లక్ మాములుగా లేదుగా.. అనుకోని ప్రమాదం నుంచి కాపాడిన హెల్మెట్.. వీడియో చూస్తే మైండ్ బ్లాంకే..

|

Jun 27, 2022 | 3:51 PM

రెడ్డిట్‌లో పోస్ట్ చేసిన 28 సెకన్ల వీడియోను పోస్ట్ చేశారు. ఆ ద్విచక్ర వాహనం వెనుక ఉన్న కారు డాష్‌క్యామ్‌లో ఈ ఘటన రికార్డయింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం, స్కూటర్ తేలుక్ కుంబార్ నుంచి జార్జ్ టౌన్ వైపు వెళుతోంది.

Viral Video: లక్ మాములుగా లేదుగా.. అనుకోని ప్రమాదం నుంచి కాపాడిన హెల్మెట్.. వీడియో చూస్తే మైండ్ బ్లాంకే..
Bike Viral Video
Follow us on

మనం ఎంత జాగ్రత్తగా వెళ్లినా, విధి వక్రిస్తే మాత్రం బలి కావాల్సిందే అని పెద్దలు అంటుంటారు. ఎంత భారీ ప్రమాదం జరిగినా.. లక్ బాగుంటే మాత్రం ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న సంఘటనలు కూడా చాలానే చూశాం. ఈ మాటలు నిజమే అనేలా నెట్టింట్లో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. చాలా సరదాగా బైక్‌పై హెల్మెట్లతో ప్రయాణం చేస్తోన్న ఓ జంటపై అకస్మాత్తుగా రెండు కొబ్బరి బోండాలు పడడంతో అంతా అవాక్కయ్యారు. చూస్తుండగానే ఏం జరిగిందో తెలియక అయోమయంలో పడ్డారు. ఈ వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. మలేషియాలోని జలాన్ తెలుక్ కుంబార్‌లో ఆదివారం ఈ ఘటన జరగగా, దానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ద్విచక్రవాహనంపై వెళ్తోన్న మహిళపై కొబ్బరికాయలు పడడంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది. అయితే, ఆ మహిళ హెల్మెట్ ధరించడంతో తన ప్రాణాలను కాపాడుకుంది.

రెడ్డిట్‌లో పోస్ట్ చేసిన 28 సెకన్ల వీడియోను పోస్ట్ చేశారు. ఆ ద్విచక్ర వాహనం వెనుక ఉన్న కారు డాష్‌క్యామ్‌లో ఈ ఘటన రికార్డయింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం, స్కూటర్ తేలుక్ కుంబార్ నుంచి జార్జ్ టౌన్ వైపు వెళుతోంది. బాస్కెట్ బాల్ సైజులో కొబ్బరికాయ ఆమె తలకు బలంగా తగిలింది. అనంతరం ఆమె వాహనంపై నుంచి కిందపడి రోడ్డుపై దొర్లుకుంటూ కొంతదూరం వెళ్లినట్లు వీడియోలో చూడొచ్చు. కొబ్బరి బోండాల దెబ్బకు హెల్మెట్ కూడా పగిలిపోయి, రోడ్డుమీద పడినట్లు చూడోచ్చు.

దీంతో పక్కనే ఉన్న వారంతా రోడ్డుపైకి చేరుకుని, వారికి సహాయం చేస్తున్నట్లు కూడా వీడియోలో చూడొచ్చు. స్థానిక మీడియా కథనం ప్రకారం, మహిళ కోలుకుందని, చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారని తెలిసింది. కాగా, స్థానిక రాజకీయ నాయకుడు అజ్రుల్ మహతీర్ అజీజ్ ఈ సంఘటన గురించి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఆ మహిళ తన నియోజకవర్గంలోని తమన్ ఎమాస్‌కు చెందిన పువాన్ అనితగా గుర్తించినట్లు తెలిపాడు. ఈ క్రమంలోనే రోడ్డు మీదకు ప్రమాదకరంగా వంగి ఉన్న కొబ్బరి చెట్లను అధికారులు నరికి వేస్తారని ఆ పోస్ట్‌లో తెలిపాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..