ఆఫ్రికా(Africa)లోని బంగారు గనుల్లో ఘర్షణలు జరిగాయి. ఇది “ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రాపంచిక వివాదంగా ప్రారంభమైంది… దిగజారింది” అని రక్షణ మంత్రి దావూద్ యాయా బ్రహిమ్ AFP వార్తా సంస్థతో అన్నారు. లిబియా సరిహద్దుకు సమీపంలో ఉన్న పర్వత ప్రాంతాలైన కౌరీ బౌగౌడి జిల్లా చాద్‌లో ఉన్న గనుల్లో ఈ ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణలు గత వారం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఘర్షణల్లో వందల మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. చాలా మంది గాయపడినట్లు స్థానిక మీడియా తెలిపింది. వీటిలో వందల మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లు లిబియా కేంద్రంగా పనిచేసే ఫ్రంట్ ఫర్ ఛేంజ్ అండ్ కాంకర్డ్ ఇన్ చాద్ (FACT) పేర్కొంది. ముఖ్యంగా టామా వర్గానికి, ఓ అరబ్ గ్రూపునకు మధ్య తాజా ఘర్షణలు చోటుచేసుకున్నట్లు సమాచారం.
సైనిక బృందం ఈ ప్రాంతంలో ప్రశాంతతను పునరుద్ధరించింది. మౌరిటానియా, లిబియాకు చెందిన వ్యక్తుల మధ్య ఘర్షణలు జరిగినట్లు స్థానికులు చెప్పారు. అయితే గత వారం, చాద్ జాతీయ మానవ హక్కుల కమిషన్ అధిపతి మహమత్ నూర్ ఇబెడౌ మాట్లాడుతూ, జోక్యం చేసుకోవడానికి పంపిన సైనికులు “ప్రజలపై కాల్పులు జరిపారు” అని AFP ఉటంకిస్తూ పేర్కొంది. దాదాపు 100 మందికిపైగా మరణించినట్లు చెబుతున్నప్పటికీ వాస్తవ మరణాల సంఖ్య భారీగానే ఉండనున్నట్లు తెలుస్తుంది. అయితే, ఈ ఘర్షణలకు కారణాలు మాత్రం తెలియరాలేదు.