Chinese military: తైవాన్‌కు చైనా బెదిరింపులు.. యుద్ధం చేయాల్సి వస్తే దాడులు ఇలా ఉంటాయని వీడియో విడుదల
చైనా, తైవాన్‌ల మధ్య వివాదాలు రోజురోజుకు ముదురుతున్నాయి. ఇటీవలే తాము యుద్ధానికి సిద్ధమేనని డ్రాగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మూడు రోజుల పాటు తైవాన్ జలసంధిలో మిలిటరీ డ్రిల్స్ నిర్వహించిన అనంతరం చైనా మరో హెచ్చరిక ప్రకటన చేసింది.

చైనా, తైవాన్‌ల మధ్య వివాదాలు రోజురోజుకు ముదురుతున్నాయి. ఇటీవలే తాము యుద్ధానికి సిద్ధమేనని డ్రాగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మూడు రోజుల పాటు తైవాన్ జలసంధిలో మిలిటరీ డ్రిల్స్ నిర్వహించిన అనంతరం చైనా మరో హెచ్చరిక ప్రకటన చేసింది. ఒకవేళ తైవాన్‌తో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే తాము ఎలా దాడులు చేయబోతామనే ఓ యానిమేటెడ్ వీడియోను కూడా విడుదల చేసింది. ఆ మేరకు చైనా సైన్యానికి చెందిన ఈస్టర్న్ థియేటర్ కమాండ్ తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసింది.
అయితే ఆ వీడియోలో చైనా బలగాలైన క్షిపణులు, వాయుసేనలు, నావీ వెస్సెల్స్ తైవన్ చుట్టూ ఉన్న నీటిలోను, కొంత తైవాన్ భూభాగంపై కూడా దాడులు చేస్తున్నట్లు కనిపిస్తోంది. తైవాన్ నాయకుడు త్సాయ్ ఇంగ్-వెన్ అమెరికాకి పర్యటించిన నేపథ్యంలో ఈ వీడియోను విడుదల చేసినప్పటికీ.. అంతర్జాతీయ మద్ధతు కోసం తైవాన్ చేస్తున్న ప్రయత్నాలని అణిచివేసేందుకు చైనా లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఆ వీడియోను ఒక్కసారి మీరు కూడా చూసేయండి.




WATCH: A computer generated animation by the PLA Eastern Theater Command shows its mock joint precision strikes on the island of Taiwan on Sunday pic.twitter.com/mbjfxsPRcz
— Global Times (@globaltimesnews) April 9, 2023
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..