Lottery: రూ.248 కోట్ల జాక్‌పాక్‌ తగిలి రాత్రికి రాత్రే ధనవంతుడయ్యాడు.. కానీ భార్యపిల్లలకు మాత్రం చెప్పడట..!

|

Nov 01, 2022 | 8:30 PM

ఓ వ్యక్తి లాటరీ ద్వారా ఏకంగా రూ.248 కోట్ల జాక్‌పాక్‌ కొట్టాడు. ఇంతటి శుభవార్తను ఎవరైనా ఆత్మీయులు, కుటుంబ సభ్యులతో పంచుకుంటారు. ఆ డబ్బుతో ఏమేం చెయ్యాలో అని కలలు కంటారు. ఐతే ఈ వ్యక్తి మాత్రం..

Lottery: రూ.248 కోట్ల జాక్‌పాక్‌ తగిలి రాత్రికి రాత్రే ధనవంతుడయ్యాడు.. కానీ భార్యపిల్లలకు మాత్రం చెప్పడట..!
Chinese Lottery Winner hides 30 Million Dollars Jackpot
Follow us on

ఓ వ్యక్తి లాటరీ ద్వారా ఏకంగా రూ.248 కోట్ల జాక్‌పాక్‌ కొట్టాడు. ఇంతటి శుభవార్తను ఎవరైనా ఆత్మీయులు, కుటుంబ సభ్యులతో పంచుకుంటారు. ఆ డబ్బుతో ఏమేం చెయ్యాలో అని కలలు కంటారు. ఐతే ఈ వ్యక్తి మాత్రం తన భార్య, పిల్లలకు మాత్రం చెప్పనని అంటున్నాడు. ఒక వేళ చెబితే వాళ్లు అహంకారులుగా, సోమరిపోతులుగా మారిపోతారని అంటున్నాడు. వివరాల్లోకెళ్తే..

చైనాకు చెందిన గ్వాంగ్‌జీ జువాంగ్ అనే వ్యక్తి 80 యువాన్లకు 40 లాటరీ టికెట్లను కొన్నాడు. ఈ క్రమంలో అక్టోబర్ 24న అతనికి లాటరీ ద్వారా పెద్దమొత్తంలో డబ్బు గెల్చుకున్నాడు. ఏకంగా 30 మిలియన్ డాలర్ల (రూ. 248 కోట్లు)ను లాటరీ ద్వారా గెలుపొందాడు. ఐతే గ్వాంగ్సీ జువాంగ్ తన వ్యక్తిగత వివరాలు ఎవ్వరికీ తెలియకూడదనే ఉద్ధేశ్యంతో ప్రైజ్‌మని తాలూకు చెక్కు అందుకొనేందుకు కార్టూన్‌ వేషంలో వెళ్లాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. గత పదేళ్లుగా నేను లాటరీ టికెట్లు క్రమం తప్పకుండా కొంటున్నాను. గతంలో లాటరీ ద్వారా కేవలం కొన్ని డజన్ల యువాన్లను మాత్రమే గెల్చుకున్నాను. ఇన్నాళ్లకు నన్ను అదృష్టం వరించింది. ఇంత పెద్ద మొత్తంలో గెల్చుకున్న డబ్బు వల్ల ఉన్నట్టుంది ధనవంతుడనయ్యాను. ఐతే ఈ విషయం మాత్రం నా భార్య పిల్లలకు ఎప్పటికీ చెప్పను. ఈ విషయం తెలిస్తే ఇతరుల కంటే తమను తాము అధికులుగా భావించి భవిష్యత్తులో కష్టపడి పనిచేయడానికి వెనకాడుతారు. నా కొడుకు కష్టపడి చదవడానికి ఇష్టపడడు. లాటరీలు కొనడం నా హాబీ. వాటిని నా ఫ్యామిలీ పట్టించుకోదు. లాటరీ నాకు ఆశాకిరణం. గెల్చుకున్న డబ్బును ఎలా ఖర్చుచేయాలో ఇంకా నిర్ణయించుకోలేదు. కొన్ని రోజుల తర్వాత ప్లాన్‌ చేసుకుంటానని’ మీడియాకు తెలిపాడు.

గ్వాంగ్‌జీ జువాంగ్ లాటరీ ద్వారా గెల్చుకున్న మొత్తంలో దాదాపు 5 మిలియన్ల డాలర్లను ఓ ఛారిటీకి విరాళంగా ప్రకటించాడు. అంతేకాకుండా చైనీస్ చట్టం ప్రకారం.. అతనికి 43 మిలియన్ యువాన్లు పన్ను కట్టవల్సి ఉంటుంది. ఇక మిగిలినవి 171 మిలియన్ యువాన్లన్లు మాత్రమే. అంటే 24 మిలియన్‌ డాలర్లు గ్వాంగ్‌జీ జువాంగ్ తనతోపాటు ఇంటికి తీసుకెళ్తాడన్నమాట.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.