తస్మాత్ జాగ్రత్త… మీరు ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా… చైనా సైబర్ దాడి… ఆఫర్ల పేరుతో మోసం…

| Edited By: Pardhasaradhi Peri

Dec 20, 2020 | 1:43 PM

మీరు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో వస్తువులు కొనేందుకు నెట్‌లో తెగవెతికేస్తుంటారా..? తరచూ ఆన్‌లైన షాపింగ్ చేస్తుంటారా..? అయితే ఈ వార్త మీకోసమే..

తస్మాత్ జాగ్రత్త... మీరు ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా... చైనా సైబర్ దాడి... ఆఫర్ల పేరుతో మోసం...
Follow us on

మీరు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో వస్తువులు కొనేందుకు నెట్‌లో తెగవెతికేస్తుంటారా..? తరచూ ఆన్‌లైన షాపింగ్ చేస్తుంటారా..? అయితే ఈ వార్త మీకోసమే..

వెబ్‌సైట్‌తో పని లేకుండా మీరు ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తుంటే… ఒక సందేశం మీకు కనబడుతుంటుంది… అదే ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌ స్పిన్‌ ద లక్కీ వీల్‌’ లేదా ‘స్పిన్‌ ద లక్కీ వీల్‌’ పేరుతో ఒక లింక్‌ వస్తుంది. అది క్లిక్‌ చేస్తే చక్రం తిరుగుతున్న పేజీ ఒకటి తెరుచుకుంటుంది. ఆ చక్రం ఒప్పో ఎఫ్‌ 17ప్రో వద్ద ఆగుతుంది. దీంతో.. ఆ ఫోన్‌ మీకు ఫ్రీగా పంపిస్తున్నాం అని అందులో ఒక సందేశం కనిపిస్తుంది. కానీ అది చైనా హ్యాకర్ల పని అని తేల్చి చెబుతోంది సైబర్‌ పీస్‌ అనే స్వచ్ఛంద సంస్థ. లక్షలాదిమంది భారతీయుల వివరాలే లక్ష్యంగా చైనాకు చెందిన హ్యాకర్లు ఈ కుంభకోణానికి తెర లేపారంటూ ఒక నివేదిక విడుదల చేసింది. ‘‘చైనాలోని గువాంగ్‌డాండ్‌, హెనన్‌ ప్రావిన్సుల నుంచి హ్యాకర్లు సైబర్‌ దాడులు కొనసాగిస్తున్నారని పేర్కొంది.

నకిలీ లింకులతో…

ఫాండ్‌ షావో కింగ్‌ అనే సంస్థ నుంచి ఈ హ్యాకింగ్‌ జరుగుతోందిని సైబర్ పీస్ చెబుతోంది. అలీబాబా క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వేదికపై తమ డొమైన్లను హ్యాకర్లు నమోదు చేసుకున్నట్లు వివరించింది. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ ఆఫర్లంటూ నకిలీ లింకుల్ని సృష్టించి హ్యాకర్లు నెటిజన్లను ఆకర్షిస్తున్నారని… ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌ స్పిన్‌ ద లక్కీ వీల్‌’, ‘స్పిన్‌ ద లక్కీ వీల్‌’ వంటివన్నీ ఈ హ్యాకింగ్‌ కుంభకోణంలో భాగమేనని స్పష్టం చేసింది. ప్రజలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్‌పీస్‌ సూచించింది.