ఏ కంపెనీ అయినా సరే తమ ఉద్యోగులు శ్రద్ధతో పనిచేయాలని.. కంపెనీ అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటుంది. అందుకు ఉద్యోగులు కష్టపడే విధంగా సదుపాయాలని కల్పిస్తుంది. ఒకొక్కసారి తమ ఉద్యోగి అనారోగ్యానికి గురైతే.. వాటికీ తగిన వైద్య సహాయం అందిస్తుంది. శరీరానికి తగిన విశ్రాంతి అవసరం అనుకుంటే అందుకు తగిన సెలవులను ఇస్తుంది. ఈ విధంగా తమ ఉద్యోగిని కేరింగ్ చూసుకుంటే.. అందుకు ప్రతిఫలంగా తమ కంపెనీ అభివృద్ధి చెందేలా పనిచేస్తారని కంపెనీ యాజమాన్యం భావిస్తుంది. ఇక మహిళా ఉద్యోగిని విషయంలోకి వస్తే.. వీరి కుటుంబం, వ్యక్తిగత విషయాల్లోకి ఏ కంపెనీ యాజమాన్యం జోక్యం చేసుకోడు. తమ కంపెనీలోని రూల్స్ కు అనుగుణంగా గర్భిణీ స్త్రీలకు తగిన విశ్రాంతిని ఇస్తూ.. మెటర్నిటీ లీవ్ సదుపాయాన్ని కల్పిస్తుంది. అయితే తాజాగా చైనాకు చెందిన ఓ కంపెనీ యాజమాన్యం తమ మహిళా ఉద్యోగులు ఎప్పుడు గర్భం దాల్చాలో.. చెప్పి వార్తల్లో నిలిచింది. వివరాల్లోకి వెళ్తే..
కుటుంబ నియంత్రణ అనేది భార్యాభర్తల మధ్య పరస్పర విషయం. ఈ విషయంలో జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ ఉండదు. గర్భం దాల్చడం పిల్లల్ని పెంచడం వంటి విషయాలు పూర్తిగా భర్తభర్తలకు మాత్రమే చెందిన అంశం. తమ కంపెనీలో పని చేసే మహిళా ఉద్యోగులకు నిబంధనలకు అనుగుణంగా ప్రసూతి సెలవులు ఇవ్వడం మాత్రమే వారి పని. అప్పుడు మహిళలు తమ ప్రసవం, బిడ్డ పెంపకం చూసుకుంటారు. అయితే మహిళా ఉద్యోగుల గర్భధారణ సమయాన్ని కూడా గణించే కంపెనీ గురించి మీరు విన్నారా? అవును, ఇదే విషయంతో ఒక చైనా కంపెనీ వెలుగులోకి వచ్చింది.
మీటింగ్ పెట్టిన బాస్
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం.. ఓ కంపెనీలో పనిచేస్తున్న ముగ్గురు మహిళా ఉద్యోగులు ఒకేసారి గర్భం దాల్చారు. ఈ విషయం ఆ కంపెనీ యజమానికి తెలిసింది. వెంటనే స్పందించిన బాస్ తమ సిబ్బందికి మీటింగ్ పెట్టి.. ఒకే సారి ముగ్గురు ఉద్యోగులు గర్భం దాల్చితే కంపెనీకి ఇబ్బంది.. ఎందుకంటే మీరు మీ ఉద్యోగ బాధ్యతలను జాగ్రత్తగా చూసుకోవాలి. కనుక మీ ముగ్గరు ఒకే సారి గర్భం దాల్చకుండా వేర్వేరు సమయాల్లో గర్భం దాల్చండి. అప్పుడు పనికి ఎటువంటి ఇబ్బందులు కలగవని చెప్పాడు. అంతేకాదు.. ఒకవేళ గర్భం దాల్చాల్సి వస్తే టర్న్‌వైజ్‌గా గర్భం దాల్చి ఉండాల్సిందని ఆ మహిళా ఉద్యోగులకు సూచించారు.
సోషల్ మీడియాలో వైరలైన పోస్ట్
ఈ గర్భిణీల్లో ఒకరు తమ గర్భధారణ ప్రణాళిక గురించి చర్చించడానికి తన యజమాని మీటింగ్ పెట్టినట్లు.. తాము ఏమిచెయ్యాలంటూ సలహా కోరుతూ Weiboలో పోస్ట్ చేసింది. ఆమె చేసిన పోస్ట్ వైరల్ గా మారి చర్చకు దారి తీసింది. నివేదికల ప్రకారం, ఆ ముగ్గురు మహిళా ఉద్యోగుల్లో ఇద్దరు 37 ఏళ్లకు దగ్గరగా ఉన్నారు. ఒకరు 37 ఏళ్ల వయసున్న ఓ నవ వధువు వీలైనంత త్వరగా బిడ్డను కనాలని కోరుకుంటుంది. మరో 37 ఏళ్ల ఉద్యోగి రెండవ బిడ్డను కనాలని ఆలోచిస్తోంది. మరో ఉద్యోగి వయస్సు 28 ఏళ్లు. ఆమె సంవత్సరం ప్రారంభంలో కంపెనీలో చేరడానికి ముందే వివాహం చేసుకుంది. ఆమెకు ఉద్యోగం రాకపోయినా, గర్భం దాల్చాలనే ఆలోచనలో ఉంది. ముగ్గురు మహిళా ఉద్యోగులు ప్రసూతి సెలవు కోసం దరఖాస్తు చేసుకోవాలని భావిస్తున్న నేపథ్యంలో యజమాని . సూచనా.ఓ గర్భవతి చేసిన పోస్ట్ వైరల్ గా మారి చర్చకు దారి తీసింది.
స్త్రీల పట్ల న్యాయంగా ప్రవర్తించలేదని కొందరు భావిస్తుంటే.. ఉద్యోగం చేయడం స్త్రీలకు ఎంత కష్టమో చూడండని మరొకరు కామెంట్ చేశారు. అయితే చాలామంది ఒకే సారి ముగ్గురు ఉద్యోగులు సెలవు పెడితే.. ఇతర సిబ్బంది పని అంటూ మరికొందరు ఆందోళనా వ్యక్తం చేస్తున్నారు. మరొకరు తానే కనుక ఈ ముగ్గురు మహిళలున్న కంపెనీలో పనిచేస్తే.. వర్క్ ఓవర్‌లోడ్ తో నేను పిచ్చివాడిని అవుతానంటూ కామెంట్ చేశాడు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..