Viral News: ఎర‌క్క‌పోయి.. ఇరుకున్నాడు.. జ‌స్ట్ ఒకే ఒక్క పోస్ట్‌.. పాపం ఆ వ్యాపారి రూ.18,365 కోట్లు మ‌టాష్‌…!

|

May 13, 2021 | 9:23 PM

చైనాలో పాత‌కాలం ప‌ద్యాన్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేసినందుకు ఓ వ్యాపారికి 18వేల 365 కోట్ల న‌ష్టం వాటిల్లింది. మనం ఒక్కోసారి ఏదో చేయాల‌నుకుంటాం.. మ‌రేదో చేస్తుంటాం.

Viral News:  ఎర‌క్క‌పోయి.. ఇరుకున్నాడు.. జ‌స్ట్ ఒకే ఒక్క పోస్ట్‌.. పాపం ఆ వ్యాపారి రూ.18,365 కోట్లు మ‌టాష్‌…!
Chinese Billionaire
Follow us on

చైనాలో పాత‌కాలం ప‌ద్యాన్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేసినందుకు ఓ వ్యాపారికి 18వేల 365 కోట్ల న‌ష్టం వాటిల్లింది. మనం ఒక్కోసారి ఏదో చేయాల‌నుకుంటాం.. మ‌రేదో చేస్తుంటాం. అందుకు త‌గిన ప్ర‌తిఫ‌లాన్ని కూడా పొందుతుంటాం. ప్ర‌తిఫ‌లం మంచిదైతే ఫ‌ర్వాలేదు కాని నష్టం జరిగితే ఇబ్బందులు ఎదుర్కొంటాము. అలాటిదే ఇప్పుడు చైనాలోని ఓ బిలియ‌నీర్‌కు క‌లిగింది. చైనాకు చెందిన మిటువాన్ సంస్థ సీఈఓ వాంగ్జింగ్ బిలియ‌నీర్‌. ఎప్పుడూ సోష‌ల్ మీడియాలో చురుకుగా ఉంటూ పోస్టింగ్‌లు పెడుతుంటాడు. వాంగ్జింగ్ బిలియ‌నీర్‌ ఇటీవ‌ల 1100 ఏండ్ల క్రితం నాటి ప‌ద్యం ఒక‌టి దొరికింది. ఎంతో పురాత‌న‌మైంది క‌దా.. సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తే త‌న పేరు మార్మోగిపోతుంద‌ని భావించాడు. ఇంకే అనుకున్న‌దే త‌డ‌వుగా దాన్ని మ‌రింత డిజైన్లు దిద్ది మ‌రీ పోస్ట్ చేశాడు. అయితే, అలా సోష‌ల్ మీడియాలో ఆ పురాత‌న ప‌ద్యాన్ని పోస్ట్ చేశాడో లేదో ఆయ‌న సంప‌ద మెల్ల‌మెల్ల‌గా ఆవిరై పోవ‌డం ప్రారంభించింది. ఈ విష‌యాన్ని వాంగ్జింగ్ గుర్తించేలోపే దాదాపు 18వేల370 కోట్లు న‌ష్ట‌పోయడు.

వాంగ్జింగ్ పోస్ట్ చేసిన 1100 ఏండ్ల నాటి ప‌ద్యం చైనా మొదటి చక్రవర్తి అణచివేత విధానాలపై వ్రాయబడింది. ఈ ప‌ద్యాన్ని పోస్ట్ చేసినప్పుడు అతను చైనా ప్రస్తుత జీ జిన్‌పింగ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడని ప్రజలు భావించారు. ఆయ‌న సంస్థ‌ల నుంచి షేర్ల‌ను న‌ష్టాల‌కు విప‌రీతంగా అమ్మేసుకున్నారు. దాంతో వేల కోట్ల‌లో న‌ష్ట‌మొచ్చిప‌డింది. పప్పులో కాలేసాన‌ని తెలుసుకున్న వాంగ్జింగ్ త‌ర్వాత ఆ పోస్ట్‌ను తొలగించాడు. తన ఉద్దేశం ప్రభుత్వంపై విమర్శలు చేయ‌డం కాదని వివరణ ఇచ్చుకోవాల్సి వ‌చ్చింది. త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ మంది దృష్టిని ఆక‌ర్శించాల‌ని ఏది ప‌డితే అది సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయొద్ద‌ని వాంగ్జింగ్ ఇప్పుడు త‌న‌ను క‌లిసిన వారిక‌ల్లా ఉప‌దేశం చేస్తున్నాడు.

Also Read:  సోనూ ఫౌండేషన్ కి నెల్లూరు అంధయువతి విరాళం.. ఎమోషనల్ అయిన రియల్ హీరో

బిలియనీర్ బిల్ గేట్స్ ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు ఏం చేస్తాడో తెలుసా.. అతని ఫుడ్ మెనూ ఓసారి చూడండి..