China boys: అబ్బాయిల్లో ‘మగతనం’ పెంచే దిశగా చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం.. వివాదాస్పద నోటీసు జారీ

|

Feb 05, 2021 | 3:06 PM

చైనాలోని విద్యాశాఖ సంచలన నోటీసు జారీ చేసింది. దేశంలోని అబ్బాయిలు అమ్మాయిల్లా సుకుమారంగా తయారవుతున్నారన్నది ఆ నోటీసు సారాంశం.  ఈ నోటీసుపై విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

China boys: అబ్బాయిల్లో మగతనం పెంచే దిశగా చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం.. వివాదాస్పద నోటీసు జారీ
Follow us on

China boys: చైనాలోని విద్యాశాఖ సంచలన నోటీసు జారీ చేసింది. దేశంలోని అబ్బాయిలు అమ్మాయిల్లా సుకుమారంగా తయారవుతున్నారన్నది ఆ నోటీసు సారాంశం.  ఈ నోటీసుపై విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. చైనాలోని మేల్ సెలబ్రిటీలు దీనికి కొంత వరకు కారకులని చాలామంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే మహిళలు మాత్రం ఈ నోటీసు తమను కించపరిచే విధంగా ఉందని చెప్తున్నారు. బలమైన స్పోర్ట్స్  క్రీడాకారులు తమ దేశంలో ప్రస్తుతం రావడం లేదన్నది చైనా ప్రభుత్వ భావన. దీంతో, చైనా విద్యా శాఖ తమ టార్గెట్ ఉటంకిస్తూ  ఓ నోటీసు విడుదల చేసింది. టీనేజ్ యువకుల  ఫిజికల్ ఫిట్ నెస్ విషయంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలని సూచించింది. శారీరక శిక్షణ ఉపాధ్యాయుల నియామకాలపై ఫోకస్ పెట్టాలని ప్రతిపాదించింది.

రిటైర్ అయిన క్రీడాకారులను, క్రీడా నేపథ్యం ఉన్న వారిని శారీరక శిక్షణ ఉపాధ్యాయులుగా రిక్రూట్ చేసుకోవాలని ఈ నోటీసులో సలహా ఇచ్చారు. విద్యార్థుల్లో మగతనం పెంచే లక్ష్యంతో క్రీడలను, ముఖ్యంగా ఫుట్‌బాల్ లాంటి క్రీడల్లో కఠినమైన ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. దేశంలోని యువకుల్లో చాలామంది బలహీనంగా ఉంటున్నారని.. అందుకే  ఇలాంటి చర్యల దిశగా అడుగులు వేయబోతున్నట్లు  చైనా ఇంతకు గతంలో సిగ్నల్స్ ఇచ్చింది. చైనా మనుగడ, అభివృద్ధి ప్రమాదంలో పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. చైనా విద్యా శాఖ నోటీసుపై చాలా మంది చైనీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

ఇవి కూడా చదవండి