China Rains: వర్షాలు, వరదలతో చైనా అతలాకుతలం.. సోషల్ మీడియాలో షాకింగ్ దృశ్యాలు..

China Rains: గత కొద్ది రోజులుగా దోక్సూరి తుపాను ప్రభావంతో బీజింగ్‌, దాని చుట్టుపక్కల ప్రాంతాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలు, వరదలు ప్రజలు నరకాన్ని చూస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 20 మందికిపైగా చనిపోగా.. మరో 27 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. నదులు..

China Rains: వర్షాలు, వరదలతో చైనా అతలాకుతలం.. సోషల్ మీడియాలో షాకింగ్ దృశ్యాలు..
China Rains

Updated on: Aug 04, 2023 | 4:14 PM

China Rains: జూలై నెలలో ఉత్తర భారత దేశాన్ని వర్షాలు ఆగుకుండా కుమ్మేశాయి. ఎన్నడూ లేని విధంగా యమునా నది ఉప్పొంగింది. ఫలితంగా కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి అతలాకుతలమైన సంగతి తెలిసిందే. మన తెలుగురాష్ట్రాల్లో కూడా బాగానే వర్షాలు కురిసినా అంతటి పరిస్థితి లేదు. అయితే ఉత్తర భారత దేశాన్ని మించిన పరిస్థితి ఏర్పడించి చైనాలో.. అవును, చైనాలో 140 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో ప్రజలు, పశువులు ప్రాణాల కోసం పోరాడుతున్నాయి. గత కొద్ది రోజులుగా దోక్సూరి తుపాను ప్రభావంతో బీజింగ్‌, దాని చుట్టుపక్కల ప్రాంతాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలు, వరదలు ప్రజలు నరకాన్ని చూస్తున్నారు.

అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం వర్షాల కారణంగా చైనాలో ఇప్పటివరకు దాదాపు 20 మందికిపైగా చనిపోగా.. మరో 27 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. నదులు పొంగిపొర్లుతున్నాయి. అవసరమైన సామాగ్రి నిల్వ చేసిన గోదామ్‌లు నీటితో నిండిన జలాశయంలా మారాయి. ఇక్కడ ఇంట్లోని వస్తువులు నీటిలో కొట్టుకుపోతున్నాయి. అంతే కాదు ఎక్స్ ప్రెస్ డెలావేర్ ప్రాంతంలోని కార్లు, ట్రక్కులు కూడా కొట్టుకుపోయాయి.

ఇవి కూడా చదవండి

వర్షాల ఉదృతికి కొట్టుకుపోయిన రోడ్డు.. అందులో పడిన ఎస్‌యూవీ కార్

వరదల కారణంగా 1 లక్ష మందికి పైగా ప్రజలు నిలువనీడ కోల్పోయారు. ఇక ఫిలిప్పీన్స్‌లో తీవ్ర ఆందోళన కలిగించిన డోక్సూరి తుపాను జూలై 30న చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్‌లోకి ప్రవేశించింది. ప్రస్తుతం, ఈ తుఫాను బీజింగ్‌ను ముంచెత్తింది. 25 సంవత్సరాల క్రితం నిర్మించిన వరద నిల్వ రిజర్వాయర్‌ను మొదటిసారి ఉపయోగించారు.

వర్షం కారణంగా ఉత్తరచైనాలో స్తంభించిపోయిన జనజీవనం..

జినాన్ నగర పరిస్థితి..


వర్షాలు, వరదలతో అతలాకుతలమైన బాధితులను ఆదుకోవడంలో విఫలమయ్యిందంటూ చైనా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంత నష్టం జరిగినా జిన్‌పింగ్ సర్కారు చోధ్యం చూస్తోందంటూ ఆ దేశ ప్రజలు సోషల్ మీడియా వేదికగానూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..