Alien: ఏలియన్స్ వచ్చేశాయ్..! టెలీస్కోప్‌ సిగ్నల్ ద్వారా గుర్తించిన చైనా.. ఇంతలోనే..

|

Jun 15, 2022 | 4:02 PM

చైనాకు చెందిన సైన్స్ అండ్ టెక్నాల‌జీ డెయిలీ ఈ విష‌యాన్ని ప్రపంచదేశాలకు వెల్లడించింది. తొలుత రిపోర్ట్‌ను ప్రచురించినా.. ఆ త‌ర్వాత ఆ నివేదిక‌ల్ని డిలీట్ చేశారు.

Alien: ఏలియన్స్ వచ్చేశాయ్..! టెలీస్కోప్‌ సిగ్నల్ ద్వారా గుర్తించిన చైనా.. ఇంతలోనే..
(Image for representation) Aliens
Follow us on

China – Alien civilizations: సాధ్యం కానీ ఎన్నో విషయాలను సుసాధ్యం చేసి చూపించింది చైనా. అయితే ఈ మధ్యే చైనా ప్రభుత్వం ఓ భారీ రేడియో టెలిస్కోప్‌ స్కై ఐ (Sky Eye telescope) ని తయారు చేసింది. ఆ స్కై ఐ ఇప్పుడు ఓ కొత్త స‌మాచారాన్ని ఇచ్చింది. ఈ భూగోళం అవ‌త‌ల కూడా ప్రాణులు ఉన్నట్లు గుర్తించింది. చైనాకు చెందిన సైన్స్ అండ్ టెక్నాల‌జీ డెయిలీ ఈ విష‌యాన్ని ప్రపంచదేశాలకు వెల్లడించింది. తొలుత రిపోర్ట్‌ను ప్రచురించినా.. ఆ త‌ర్వాత ఆ నివేదిక‌ల్ని డిలీట్ చేశారు. అయితే ఇలా డిలీట్‌ చేసినందుకు గానూ ఇప్పుడో వార్త సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

భూగోళం అవతాల కూడా ప్రాణాలు ఉన్నాయని, అవి గ్రహాంత‌ర జీవాలేన్న విషయాన్ని తెలుసుకున్నందుకే ఆ నివేదికను డిలీట్‌ చేసిన్నట్లు వార్తలు వైరల్‌ అవుతున్నాయి. అయితే ఈ వార్తలపై స్పందించని చైనా.. స్కై ఐ టెలిస్కోప్‌కు చెందిన ఎల‌క్ట్రోమ్యాగ్నటిక్ సిగ్నల్స్‌ను సైంటిస్టులు ఇంకా స్టడీ చేస్తున్నారని బీజింగ్ వ‌ర్సిటీలో తెలిపింది.

స్కై ఐ అందించిన సిగ్నల్స్‌పై కొన్ని అనుమానాలు ఉన్నాయ‌ని, ఓ త‌ర‌హా రేడియో త‌రంగాల ప్రమేయం జ‌రిగింద‌ని, దీనిపై మ‌రింత విశ్లేష‌ణ అవ‌స‌ర‌మ‌ని జాంగ్ తెలిపారు. అయితే ప్రస్తుతం గ్రహాంత‌ర‌వాసుల స‌మాచారం చైనాలో సోష‌ల్ నెట్వర్క్ వీబోలో ట్రెండ్ అవుతోంది. ఆ స‌మాచారాన్నే దేశంలోని ఇత‌ర మీడియా కూడా వైర‌ల్ చేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..