భారత జనరిక్‌ మందులకు చైనా గ్రీన్ సిగ్నల్!

భారత్‌కు చెందిన జనరిక్‌ మందుల విషయంలో కఠిన నిబంధనలను చైనా సడలించింది. దీని ప్రకారం భారత్‌కు చెందిన జనరిక్‌ మందులను ఇప్పుడు చైనాలో కొన్ని పరిమితుల మధ్య వినియోగించే వెసులుబాటు ఉంటుంది. డిసెంబరు 1 నుంచి రోగులు ఈ మందులు వాడుకొవచ్చని చైనాకు చెందిన అధికారిక వార్తా సంస్థ గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొంది. ఇప్పటి వరకూ విదేశాల నుంచి దిగుమతి అయ్యే జనరిక్‌ మందుల విషయంలో చైనా ఉక్కు పాదం మోపుతూ వస్తోంది. వాటిని నకిలీ మందుల […]

భారత జనరిక్‌ మందులకు చైనా గ్రీన్ సిగ్నల్!
Follow us

| Edited By:

Updated on: Aug 28, 2019 | 5:46 AM

భారత్‌కు చెందిన జనరిక్‌ మందుల విషయంలో కఠిన నిబంధనలను చైనా సడలించింది. దీని ప్రకారం భారత్‌కు చెందిన జనరిక్‌ మందులను ఇప్పుడు చైనాలో కొన్ని పరిమితుల మధ్య వినియోగించే వెసులుబాటు ఉంటుంది. డిసెంబరు 1 నుంచి రోగులు ఈ మందులు వాడుకొవచ్చని చైనాకు చెందిన అధికారిక వార్తా సంస్థ గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొంది. ఇప్పటి వరకూ విదేశాల నుంచి దిగుమతి అయ్యే జనరిక్‌ మందుల విషయంలో చైనా ఉక్కు పాదం మోపుతూ వస్తోంది. వాటిని నకిలీ మందుల కింద జమ కట్టి, జనరిక్‌ ఔషధాల చెలామణిని అక్రమ వ్యాపారం కింద పరిగణిస్తోంది.

అయితే, ఈ మందులను తక్కువ మోతాదులో దిగుమతి చేసుకోవడానికి మాత్రమే అనుమతి ఉంటుందని, లాభాపేక్ష ఆకాంక్షతో పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకోవాలనుకుంటే మరికొన్ని నిబంధనలు పాటించాల్సిందేనని గ్లోబల్‌ టైమ్స్‌ కథనం వివరించింది. చైనాలో క్యాన్సర్‌ బారిన పడి బాధపడుతున్న వారికి ఈ పరిణామం ఊరట కలిగించనుంది. ఈ జబ్బుకు చవకైన, ప్రభావవంతమైన జనరిక్‌ మందులు భారత్‌ నుంచి దిగుమతి అవుతాయని తెలిసినా వాటిని వాడే పరిస్థితి ఉండేది కాదు. ‘‘ప్రపంచ వ్యాప్తంగా భారత్‌లో తయారైన జనరిక్‌ మందులకు మంచి పేరుంది. ఈ విషయంలో చైనాకు చెందిన ఔషధ సంస్థలు భారత్‌ నుంచి చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే చైనాకు చెందిన జనరిక్‌ మందుల్లో నాణ్యత ఆశించిన స్థాయిలో లేదు.’’ అని చైనా-ఐరోపా అంతర్జాతీయ బిజినెస్‌ స్కూల్‌ ప్రొఫెసర్‌ అన్నారు.