China galwan clash video : గత ఏడాది జూన్ 15 న గాల్వన్ లోయలో తమకు, భారత సైనికులకు మధ్య జరిగిన ఘర్షణల తాలూకు వీడియోను చైనా తాజాగా రిలీజ్ చేసింది. ఈ వీడియోలో డజన్ల కొద్దీ ఉభయ దేశాల జవాన్లు ఘర్షణ పడడం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్లాషెస్ లో తమ వైపు కూడా చాలామంది సైనికులు గాయపడడమో, మరణించడమో జరిగిందని చైనా ప్రకటించింది. నాటి ఘర్షణల్లో 30 మంది చైనా సోల్జర్స్ మృతి చెందారని భారత ఆర్మీ వెల్లడించింది. మనవైపున 20 మంది జవాన్లు మరణించినట్టు కూడా తెలిపింది. తమ భూభాగంలోకి భారత సైనికులు అక్రమంగా చొచ్ఛుకువచ్చారని చైనీస్ స్టేట్ మీడియా ఎనలిస్ట్ షెన్ షివె ట్వీట్ చేశారు. కానీ గాల్వన్ వ్యాలీలో ఉభయ దేశాల సైనికులు ఒకరికొకరు తోసుకోవడం, ఫ్లాష్ లైట్ల వెలుగులో కర్రలు, షీల్డులతో తలపడడం కూడా ఈ వీడియోలో కనిపించింది. చీకట్లో గట్టి కేకలు సైతం వినిపించాయి. భారత జవాన్లు తమ పెట్రోలింగ్ పాయింట్ వద్దకు వెళ్తుండగా చైనా దళాలు అడ్డుకున్నాయి. దీంతో వారిని ఎదుర్కొనేందుకు భారత ఆర్మీ సమాయత్తమైంది.
కాగా ఆ నాటి ఘర్షణల్లో చైనా సేనలు పెద్ద బండరాళ్లతో కూడా భారత జవాన్లపై దాడి చేసినట్టు వార్తలు వచ్చాయి. ఉభయుల మధ్య కాల్పులు జరగనప్పటికీ పరిస్థితి మాత్రం దాన్ని మించి కనిపించింది.
On-site video of last June’s #GalwanValley skirmish released.
It shows how did #India’s border troops gradually trespass into Chinese side. #ChinaIndiaFaceoff pic.twitter.com/3o1eHwrIB2— Shen Shiwei沈诗伟 (@shen_shiwei) February 19, 2021
Also Read:
FASTag: మార్చి 1వ తేదీ వరకు ఉచితంగా ఫాస్టాగ్.. కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం..
Indo-china Talks: భారత-చైనా దేశాల మధ్య నేడు పదో దఫా చర్చలు, ఇక ఖాళీ కానున్న గాల్వన్ లోయ.