చైనా అధ్యక్షుడు జీ జిన్ ఫింగ్ టిబెట్ పర్యటనతో భారత సరిహద్దు వివాదం మరింత జటిలం ? బ్రిటిష్ నిపుణుని విశ్లేషణ

| Edited By: Anil kumar poka

Jul 24, 2021 | 10:58 AM

చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ టిబెట్ పర్యటనతో భారత్ తో చైనాకు గల సరిహద్దు వివాదం మరింత జటిలమయ్యే అవకాశం ఉందని బ్రిటిష్ అకడమిక్ ప్రొఫెసర్ రాబర్ట్ బార్నెట్ అంటున్నారు. లాసాలో జీ జిన్ పింగ్ ఈ నెల 22 న ప్రజలకు ఇచ్చిన మెసేజ్ ఇండియాకు

చైనా అధ్యక్షుడు జీ జిన్ ఫింగ్ టిబెట్ పర్యటనతో భారత సరిహద్దు వివాదం మరింత జటిలం ?  బ్రిటిష్ నిపుణుని విశ్లేషణ
China President,xi Jinping Tibet Visit,india,border Row,british Professor Analysis
Follow us on

చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ టిబెట్ పర్యటనతో భారత్ తో చైనాకు గల సరిహద్దు వివాదం మరింత జటిలమయ్యే అవకాశం ఉందని బ్రిటిష్ అకడమిక్ ప్రొఫెసర్ రాబర్ట్ బార్నెట్ అంటున్నారు. లాసాలో జీ జిన్ పింగ్ ఈ నెల 22 న ప్రజలకు ఇచ్చిన మెసేజ్ ఇండియాకు సమస్యలు తెచ్చిపెట్టేదిగా ఉందని రాబర్ట్ పేర్కొన్నారు. లాసాలో జిన్ పింగ్ టిబెటన్లతోను, తమ దేశ నేతలతోనూ మాట్లాడుతున్న దృశ్యాల తాలూకు వీడియోను రాబర్ట్ విడుదల చేశారు. సరిహద్దుల్లో భారత, చైనా దేశాలు రెండూ తమ బలగాలను పెంచుకుంటున్న తరుణంలోనూ, జిన్ పింగ్ టిబెట్ టూర్ నేపథ్యంలోనూ ఈ బ్రిటిష్ ప్రొఫెసర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2011 లో కూడా జీ జిన్ పింగ్ టిబెట్ ను సందర్శించాడు. అయితే అప్పుడు ఉభయ దేశాల మధ్య ఇంత ఉద్రిక్తత లేదు.టిబెట్ పై రాబర్ట్ కొన్ని దశాబ్దాలుగా అధ్యయనం చేస్తున్నారు. అక్కడి భౌగోళిక పరిస్థితులను, చైనా పరిస్థితులను ఆయన తరచూ బేరీజు వేస్తున్నారు. టిబెట్ పై తమకే హక్కు ఉందని చైనా పలుమార్లు బాహాటంగానే ప్రకటించిందన్న విషయాన్ని రాబర్ట్ గుర్తు చేస్తున్నారు.

ఇక జిన్ పింగ్ తన ఇటీవలి పర్యటనలో.. భవిషత్తులో ఇక్కడి అన్ని మతాల వారు, జాతులవారు సంతోషంగా తమ జీవితాలు గడిపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇది జాప్యం కాదన్నారు. ఇది టిబెట్ వాసులను తన ప్రసంగంతో ఆకట్టుకోవడమే కాక తమ దేశ వైఖరిని చెప్పకనే చెప్పారని బ్రిటిష్ ప్రొఫెసర్ విశ్లేషించారు. ఇది ఈ ప్రాంతంపై బీజింగ్ పట్టు సాధిస్తుందని అన్యాపదేశంగా పేర్కొనడమే అని ఆయన అన్నారు. టిబెట్ కి అతి సమీపంలోని చైనీస్ మిలిటరీ హబ్ నింగిత్రిని కూడా జిన్ పింగ్ విజిట్ చేశారు. అక్కడ కూడా తమ దేశ సైనికులతో మాట్లాడారు.

మరిన్ని ఇక్కడ చూడండి : News Watch: వాన కష్టం వరద నష్టం.. మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్… ( వీడియో )

 అత్యాశకు పోతే అంతే ఉంటది మరి..!ఇన్సూరెన్స్‌ డబ్బు ఆశతో బెంజ్‌ కారు తగులబెట్టిన వ్యక్తి..:Benz car Video.

 యజమాని కోసం పిల్లి చేసిన సాహసం..పాముతో ఫైట్ చేసి మరి యజమానికి ముప్పు తప్పించింది..వీడియో:Cat Fight With Snake Video.

 ఐదు కొమ్ములతో అరుదైన గొర్రె..!ఎందుకిలా..?యుగాంతానికి సంకేతమా..?:sheep has 5 horns Video.