Chinese Army: జపాన్-చైనా మధ్య కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు.. వార్‌కు రెడీకావాలని కాలుదువ్విన జిన్‌పింగ్.

|

Nov 10, 2022 | 1:32 PM

చైనాలో సెంట్రల్‌ కమిటీకి ఎన్నిక ద్వారా షి జిన్‌పింగ్‌ అక్టోబర్‌లో మూడోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. దీంతో CPC జనరల్‌ సెక్రటరీతో పాటు సెంట్రల్‌ మిలటరీ కమిషన్‌, పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీల బాధ్యతలను నిర్వహించనున్నారు.

Chinese Army: జపాన్-చైనా మధ్య కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు.. వార్‌కు రెడీకావాలని కాలుదువ్విన జిన్‌పింగ్.
China President Xi Jinping
Follow us on

చైనా జాతీయ భద్రతలో అనిశ్చితి పెరుగుతోందన్నారు అధ్యక్షుడు జి జిన్‌పింగ్. 2027 నాటికి ప్రపంచస్థాయి సైనిక శక్తిగా ఎదగాలని పెట్టుకున్న లక్ష్యంపై సైనికాధికారులు దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. తన మూడవ టర్మ్‌లో ఆర్మీ జాయింట్ ఆపరేషన్స్ కమాండ్ హెడ్‌క్వార్టర్స్‌కు తన మొదటి పర్యటనలో ఈ వ్యాఖ్యలు చేశారు. సైనిక శిక్షణ, పోరాట సంసిద్ధతను పెంపొందించుకోవాలని సూచించారు. పోరాటాలకు సిద్ధంగా ఉండేందుకు అన్ని వనరులను వినియోగించుకోవాలని.. యుద్ధాల్లో గెలిచే సామర్థ్యాలను పెంచుకోవాలని సూచించారు. కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ చైనాలో సెంట్రల్‌ కమిటీకి ఎన్నిక ద్వారా షి జిన్‌పింగ్‌ అక్టోబర్‌లో మూడోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. దీంతో CPC జనరల్‌ సెక్రటరీతో పాటు సెంట్రల్‌ మిలటరీ కమిషన్‌, పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీల బాధ్యతలను నిర్వహించనున్నారు. ఇలా పార్టీ అధినేతగా, అధ్యక్షుడిగా, సర్వసైన్యాధ్యక్షుడిగా మూడు అత్యంత శక్తిమంతమైన విభాగాలకు షి జిన్‌పింగ్‌ మూడోసారి నాయకత్వం వహిస్తున్నారు. ఐదేళ్లపాటు జిన్‌పింగ్‌ ఈ బాధ్యతల్లో ఉంటారు.

సైన్యానికి జిన్‌పింగ్‌ సూచనలు

చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ తన సైన్యానికి కొన్ని సూచనలు చేశారు. జాతీయ సార్వభౌమాధికారం, భద్రత, అభివృద్ధి ప్రయోజనాలను రక్షించడానికి సైనిక నాయకత్వాన్ని నిర్దేశించారు. చైనా అధికారిక Xinhua వార్తా సంస్థ పేర్కొంది. Xiతో కొత్త సీఎంసీ నాయకత్వం వచ్చింది. ఇది కాంగ్రెస్‌లో పునర్వ్యవస్థీకరణను చూసింది. జనరల్ హీ వీడాంగ్ (65) సీఎంసీ కొత్త వైస్ చైర్మన్‌గా నియమితులయ్యారు. అధ్యక్షుడు జి జిన్‌పింగ్ సన్నిహితుడు జనరల్ జాంగ్ యుక్సియా (72) వైస్ ప్రెసిడెంట్‌గా మరో పదవీ బాధ్యతలు చేపట్టారు.

అయితే చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ తన ప్రసంగంలో నిర్దిష్టంగా ఏ దేశాన్ని ప్రస్తావించనప్పటికీ.. వనరులు అధికంగా ఉన్న ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా  దూకుడుగా ఉండాలని మాత్రం సూచించారు. తూర్పు లడఖ్‌లో చైనా, భారతదేశ సైన్యాలు కూడా సుదీర్ఘ ప్రతిష్టంభనలో నిమగ్నమై ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలావుంటే..  దక్షిణ చైనా సముద్ర సరిహద్దు విషయంలో తైవాన్, ఫిలిప్పీన్స్, బ్రూనై, మలేషియా, వియత్నాంలకు చైనాకు మధ్య వివాదం చాలా కాలంగా కొనసాగుతోంది. బీజింగ్ దక్షిణ చైనా సముద్రంలో కృత్రిమ ద్వీపాలు, సైనిక స్థావరాలను నిర్మించింది. తూర్పు చైనా సముద్రంలో జపాన్‌తో చైనాకు ప్రాదేశిక వివాదాలు కూడా ఉన్నాయి.

PLA  శతాబ్ది లక్ష్యాన్ని సాకారం చేయడంపై సైనిక నాయకత్వం తప్పనిసరిగా దృష్టి సారించాలని జి అన్నారు. PLAని 2027 నాటికి ప్రపంచ స్థాయి సాయుధ దళంగా మార్చడం, దీనిని US సాయుధ దళాలతో సమానంగా తయారు చేసినట్లు విస్తృతంగా అర్థం చేసుకోవచ్చు.

పవర్ ఫుల్ లీడర్..

మావో జెడాంగ్ తర్వాత అంతటి శక్తివంతమైన నేతగా జిన్ పింగ్ కనిపిస్తున్నారనీ. ఆయన శాశ్వతంగా చైనా అధికార పగ్గాలు చేపట్టేంత పవర్ ఫుల్ లీడరనీ.. సీపీసీ సమావేశాల్లో జిన్ పింగ్ మూడోసారి చైనా అధ్యక్ష పదవి దక్కించుకున్న తర్వాత ఆయన గురించి చెప్పుకుంటున్నారు చైనా అంతర్గత వ్యవహారాల నిపుణులు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..